Congress: నీట్ పరీక్ష పత్రం లీకేజ్ వెనుక కేంద్రమంత్రులు.. కాంగ్రెస్ నేత సంచలన ఆరోపణలు
ABN , Publish Date - Jun 23 , 2024 | 05:08 PM
నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి (Shiva Sena Reddy) డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష పత్రం లీకేజ్ చేసిన నిందితులను విచారిస్తే బీజేపీ నేతల బండారం బయటపడుతుందని చెప్పారు.
హైదరాబాద్: నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి (Shiva Sena Reddy) డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష పత్రం లీకేజ్ చేసిన నిందితులను విచారిస్తే బీజేపీ నేతల బండారం బయటపడుతుందని చెప్పారు. బీజేపీ స్టేట్ ఆఫీస్ ముట్టడికి ఈరోజు( ఆదివారం) యూత్ కాంగ్రెస్ పిలిపు నిచ్చింది. దీంతో బీజేపీ ఆఫీను ముట్టడికి వెళ్లిన శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు వారికి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడ కొద్దిసేపటి వరకు ఘర్షణ వాతావరణం నెలకొంది. బీజేపీ ప్రభుత్వం విద్యార్థులకు తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం శివసేన రెడ్డి మీడియాతో మాట్లాడుతూ...నీట్ లీకేజిలో 14 మంది కేంద్ర మంత్రుల ప్రమేయం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. వారి పిల్లల భవిష్యత్ కోసం నీట్ పేపర్ లీకేజ్ చేశారని విమర్శలు చేశారు. అసలు నిజాలు బయటపడితే.. కేంద్ర ప్రభుత్వం కుప్పకూలిందన్నారు. అందుకే నీట్ పరీక్ష రద్దు చేసేందుకు కేంద్రం వెనకడుతుందని చెప్పారు.నీట్ పేపర్ లీకేజికి నైతిక బాధ్యత వహించి..కేంద్ర విద్య శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 23లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కేంద్రం జలగటం ఆడుతుందని విమర్శించారు. పార్లమెంట్ ముట్టడికి సిద్దమవుతామని అన్నారు. పార్లమెంట్లో నీట్ మీద ప్రశ్నిస్తామని పేర్కొన్నారు.