Share News

Balmoor Venkat: అలాంటి వ్యక్తి వచ్చాడనే గన్‌పార్క్ వద్ద పసుపు నీళ్లతో శుద్ధి చేశా..

ABN , Publish Date - Apr 26 , 2024 | 02:45 PM

Telangana: ఆగష్టు 15లోగా ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సిద్ధమంటూ గన్‌పార్క్‌ అమరవీరుల స్థూపం వద్ద మాజీ మంత్రి హరీష్‌రావు రాజీనామా లేఖను ఉంచారు. ఆ తరువాత అక్కడకు చేరుకుని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్... అమరవీరుల స్థూపాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేశారు.

Balmoor Venkat: అలాంటి వ్యక్తి వచ్చాడనే గన్‌పార్క్ వద్ద పసుపు నీళ్లతో  శుద్ధి చేశా..
Congress MLC Balmoor Venkat

హైదరాబాద్, ఏప్రిల్ 26: ఆగష్టు 15లోగా ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సిద్ధమంటూ గన్‌పార్క్‌ అమరవీరుల స్థూపం వద్ద మాజీ మంత్రి హరీష్‌రావు (MLA Harish Rao) రాజీనామా లేఖను ఉంచారు. ఆ తరువాత అక్కడకు చేరుకుని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ (Congress MLC Balmoor Venkat)... అమరవీరుల స్థూపాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరవీరుల చావుకి కారణమైన హంతకుడు హరీష్ రావు అంటూ విరుచుకుపడ్డారు. ఉద్యమ సమయంలో నిరుద్యోగులను, యువతను పొట్టనపెట్టుకున్న వ్యక్తి హరీష్ రావు అని..అలాంటి వ్యక్తి అమరవీరుల స్థూపం వద్దకు రావడంతో ఈ ప్రాంతం మైల పడిందన్నారు. అందుకే పసుపు నీళ్లతో శుద్ధి చేయడం జరిగిందని చెప్పుకొచ్చారు.

Andhra Pradesh: పసుపు అడ్డాలో పట్టు ఎవరిదో?


10 ఏళ్లుగా హరీష్ రావు‌కు బీఆర్ఎస్ నాయకులకు ఏనాడు అమరవీరుల గుర్తుకు రాలేదని మండిపడ్డారు. హరీష్‌రావు బీఆర్ఎస్‌లో ఒక జీతగాడు మాత్రమే అంటూ వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి (CM Revath Reddy) ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 వరకు ఏకకాలంలో రుణమాఫీ చేసి తీరుతారని స్పష్టం చేశారు. హరీష్ రావు స్పీకర్ ఫార్మాట్లో కాకుండా రాజీనామా లేఖను రాజకీయం చేశారన్నారు. హరీష్ రావు రాజీనామా లేక వృధా కానివ్వమని.. ఆగస్టు 15 తర్వాత కచ్చితంగా రాజీనామాను ఆమోదింపజేసే బాధ్యత తానే తీసుకుంటానని తెలిపారు. శాసనసభ వ్యవహారాల మంత్రిగా పని చేసిన హరీష్‌కు రాజీనామా ఎలా చేయాలో కూడా తెలీదా అని ప్రశ్నించారు. కేవలం రాజకీయం కోసం వచ్చి డ్రామాలు అడుతున్నారని విమర్శించారు.

Viral News: MS ధోని పేరుతో కొత్త స్కాం..జర జాగ్రత్త


ఆగస్ట్ 15వ తేదీ లోగా రూ.2లక్షల రుణమాఫీ చేస్తే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన్నట్లు బీఆర్ఎస్ రద్దు చేస్తారో? లేదో? కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘హరీష్ రావు ఆగస్ట్ 15 తర్వాత మీ రాజీనామా ఆమోదం చెందేలా ఎమ్మెల్సీగా నేను బాధ్యత తీసుకుంటాను. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే దొంగలా వచ్చి వెళ్ళడం కాదు. పదేళ్లలో మీరు ఏం చేశారో చెప్పండి.. రండి ఎమ్మెల్సీగా నేను మీకు సవాల్ విసురుతున్నాను’’ అంటూ బల్మూర్ వెంకట్ వ్యా్ఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి...

Kothakota Srinivas: ప్రభాకర్‌కు రెడ్‌ కార్నర్ నోటీసులపై హైదరాబాద్ సీపీ షాకింగ్ కామెంట్స్

Congress: హరీష్‌రావు రాజీనామా స్పీకర్ ఫార్మాట్‌లో లేదు: మంత్రి కోమటిరెడ్డి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 26 , 2024 | 02:45 PM