Sharees: పెరిగిన కంచి పట్టుచీరల ధరలు..
ABN , Publish Date - Apr 26 , 2024 | 01:29 PM
కంచి పట్టు చీరల ధరలు పెరిగాయి. కాంచీపురం(Kanchipuram) చేనేత పట్టుచీరలు ప్రపంచప్రసిద్థిగాంచినవి. కేంద్ర ప్రభుత్వ భౌగోళిక గుర్తింపు పొందిన పారంపర్య పట్టుచీరల ఉత్పత్తి వివిధ కారణాలతో రోజురోజుకు దెబ్బతింటోంది.
చెన్నై: కంచి పట్టు చీరల ధరలు పెరిగాయి. కాంచీపురం(Kanchipuram) చేనేత పట్టుచీరలు ప్రపంచప్రసిద్థిగాంచినవి. కేంద్ర ప్రభుత్వ భౌగోళిక గుర్తింపు పొందిన పారంపర్య పట్టుచీరల ఉత్పత్తి వివిధ కారణాలతో రోజురోజుకు దెబ్బతింటోంది. వెండి, బంగారు సరిగతో నేయడం వల్ల 25 ఏళ్ల పాటు ఈ చీరలు మన్నికతో ఉంటున్నాయి.
ఇదికూడా చదవండి: Lok Sabha 2024 Elections: రెండో దశలో వీళ్లే అత్యంత ధనవంతులైన అభ్యర్థులు
ఏడాదికి సుమారు రూ.300 కోట్లకు ఈ చీరల వ్యాపారం జరుగుతోంది. కనిష్టంగా రూ.10 వేలు నుంచి రూ.2 లక్షల వరకు చీరల ధరలుంటాయి.ఈ నేపథ్యంలో, సరిగ ధరలు పెరగడంతో చీరల ధరలు కూడా తయారీదారులు పెంచారు. గత ఏడాది కన్నా 30 శాతం వరకు ధరలు పెరిగాయి.
ఇదికూడా చదవండి: Delhi: రెండో విడత పోలింగ్ వేళ.. ఓటర్లకు ప్రధాని మోదీ కీలక సూచనలు
Read Latest National News and Telugu News