Share News

Jagadish Reddy: కుట్రబుద్దితో మాపై తప్పుడు ఆరోపణలు.. ప్రభుత్వంపై జగదీష్‌రెడ్డి ఫైర్

ABN , Publish Date - Jun 29 , 2024 | 08:55 PM

యాదాద్రి విద్యుత్ ప్లాంట్ విషయంలో చేస్తున్న వాదనలో సహేతుకత లేదని మాజీమంత్రి జగదీష్ రెడ్డి (Jagadish Reddy) తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన ఒప్పందాలపై ఎల్ నరసింహ రెడ్డి కమిషన్‌ సమాచారం కోరిందని, ఈ రోజు రిప్లై పంపించినట్లు చెప్పారు.

Jagadish Reddy: కుట్రబుద్దితో మాపై తప్పుడు ఆరోపణలు.. ప్రభుత్వంపై జగదీష్‌రెడ్డి ఫైర్
Jagadish Reddy

నల్డొండ: యాదాద్రి విద్యుత్ ప్లాంట్ విషయంలో చేస్తున్న వాదనలో సహేతుకత లేదని మాజీమంత్రి జగదీష్ రెడ్డి (Jagadish Reddy) తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన ఒప్పందాలపై ఎల్ నరసింహ రెడ్డి కమిషన్‌ సమాచారం కోరిందని, ఈ రోజు రిప్లై పంపించినట్లు చెప్పారు. తన వద్ద ఉన్న వివరాలను పీఏ ద్వారా కమిషన్‌కు పంపించినట్లు తెలిపారు. ఈ రోజు ఎల్. నర్సింహారెడ్డి కమిషన్‌కు తన వద్ద ఉన్న సమాచారాన్ని ఇచ్చానని అన్నారు. మెయిల్ ద్వారా పంపించానని , తన పీఏ ద్వారా నేరుగా కమిషన్‌కు సమాచారం అందజేశానని తెలిపారు. ఈరోజు(శనివారం) బీఆర్ఎస్ కార్యాలయంలోజగదీష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... PGCL లైన్ విషయంలో కొందరు కుహనా మేధావులు అర్థం లేని ఆరోపణలు చేశారని మండిపడ్డారు.


ఛతీస్‌గడ్ నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలుపై కూడా తప్పుడు ప్రచారం చేశారని చెప్పారు. 3.90రూపాయలకు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కొనుగోలు చేస్తే ఎలా నష్టం జరుగుతుందనే విషయాన్ని కమిషన్ ముందు లేవనెత్తిననని తెలిపారు.రాష్ట్రం పట్ల సోయిలేని వారు చేస్తున్న వాదన తప్పని కమిషన్ కు చెప్పానని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే తాము ఆ పనులు చేసినట్లు తెలియజేశారు.

3.90రూపాయలకంటే తక్కువ రేటుకు విద్యుత్ ఏ రాష్ట్రం కొనలేదని స్పష్టం చేశారు. మరి రాష్ట్రానికి ఎలా నష్టం జరిగినట్లని ప్రశ్నించారు. భద్రాద్రిలో సబ్ క్రిటికల్ టెక్నాలజీ మీద చర్చ అర్ధరహితమన్నారు. ఆ రోజున్న అత్యవసర పరిస్థితుల కారణంగా సబ్ క్రిటికల్ టెక్నాలజీ వినియోగించినట్లు చెప్పారు. NGT లో కేసు, కరోనా కారణంగా ప్రాజెక్ట్ కొంత ఆలస్యం అయిందని తెలిపారు. కుట్రబుద్దితో కొందరు విద్యుత్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కమిషన్‌కు చెప్పానని అన్నారు. రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని చూసే నేతల మాటల్లో వాస్తవం లేదని జగదీష్ ‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - Jun 29 , 2024 | 08:55 PM