Share News

Jupally Krishna Rao: కేసీఆర్ పాలనపై మంత్రి జూపల్లి కృష్ణారావు ధ్వజం

ABN , Publish Date - Nov 14 , 2024 | 07:26 PM

కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పునకు తమ ప్రభుత్వం నెలకు రూ.6 వేల కోట్లు వడ్డీ కడుతోందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రతి నియోజకవర్గానికి ప్రభుత్వం 3500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తుందని హామీ ఇచ్చారు.

Jupally Krishna Rao: కేసీఆర్ పాలనపై మంత్రి జూపల్లి కృష్ణారావు ధ్వజం

నిజామాబాద్: కేసీఆర్ పరిపాలనలో తెలంగాణపై రూ. 8 లక్షల కోట్లు అప్పు చేశారని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నిజామాబాద్ జిల్లాలోని ఎడపల్లి మండలం ఠానాకలాన్‌లో ఇవాళ(గురువారం) మంత్రి జూపల్లి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ...ధాన్యంతో రైతులు రైస్ మిల్లుల దగ్గరకు వెళ్లకుండా చూసే బాధ్యత అధికారులదేనని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు.


పంటమార్పిడి చేస్తేనే పంటసారం పెరుగుతుందన్నారు. రైతులు పంట మార్పిడిపై ఆలోచన చేయాలని సూచించారు.కేసీఆర్ చేసిన అప్పునకు తమ ప్రభుత్వం నెలకు రూ.6 వేల కోట్లు వడ్డీ కడుతోందని అన్నారు. ప్రతి నియోజకవర్గానికి ప్రభుత్వం 3500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తుందని హామీ ఇచ్చారు. ఒక ఇంటికి రూ.5 లక్షల చొప్పున నాలుగు విడతల్లో డబ్బులు చెల్లిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు మాటిచ్చారు.


కేంద్ర ప్రభుత్వానికి మంత్రి తుమ్మల లేఖ

Thummala.jpg

ఖమ్మం: కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. గత సంవత్సరం అక్టోబర్‌లో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన జాతీయ పసుపు బోర్డును నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల కోరారు. ‘‘తెలంగాణ రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటనేది పసుపు రైతుల చిరకాల ఆకాంక్ష. రాష్ట్రంలో పసుపు పండించే జిల్లాల్లో నిజామాబాద్ ప్రధానమైనది. ఇక్కడి పసుపు రైతులు గత పదేళ్ల నుంచి పసుపు మద్దతు ధర కోసం ఎదురుచూస్తున్నారు. జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నారు. రాష్ట్రంలో 3,300 ఎకరాల్లో కొబ్బరి తోటలు సాగులో ఉన్నాయి. కొబ్బరి రైతులు కొబ్బరి ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు‘’ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.


‘‘భద్రాద్రి కొత్తగూడంలో ప్రత్యేకంగా రీజనల్ కొకనట్ డెవలప్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేయండి. తెలంగాణలో 91,200 హెక్టార్లలో పామ్ ఆయిల్ సాగు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 40,000 హెక్టార్లలో సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి ప్రణాళికలు చేస్తున్నాం. పామ్ ఆయిల్ సాగులో తెలంగాణను దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టడానికి మా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రిసెర్చీ మాత్రమే దేశంలో ఆయిల్ పామ్‌పై పరిశోధనలు చేస్తుంది. తెలంగాణలో ప్రత్యేకంగా ప్రాంతీయ ఆయిల్ పామ్ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయండి’’ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు

Hyderabad: ఫోన్ ట్యాపింగ్ కేసు.. చిరుమర్తి లింగయ్య కీలక విషయాలు వెల్లడి..

BJP: మిడి మిడి జ్ఞానంతో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు: కిషన్ రెడ్డి

Read Latest Telangana News and TELUGU NEWS

Updated Date - Nov 14 , 2024 | 09:13 PM