Share News

Suresh Reddy: కేంద్ర బడ్జెట్ తెలంగాణకు నిరాశ కలిగించింది

ABN , Publish Date - Jul 23 , 2024 | 10:29 PM

కేంద్ర బడ్జెట్‌‌లో తెలంగాణ పునర్నిర్మాణం గురించి నిధులు ఇవ్వకపోవడం బాధాకరమని బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి (Suresh Reddy) అన్నారు.

Suresh Reddy: కేంద్ర బడ్జెట్ తెలంగాణకు నిరాశ కలిగించింది
Suresh Reddy

ఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌‌లో తెలంగాణ పునర్నిర్మాణం గురించి నిధులు ఇవ్వకపోవడం బాధాకరమని బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి (Suresh Reddy) అన్నారు. బడ్జెట్‌లో విభజన చట్టం గురించి మాట్లాడి తెలంగాణ గురించి ప్రస్తావించలేదని చెప్పారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి నిధుల కేటాయింపు ఆ రాష్ట్ర విజయమని కొనియాడారు. ఈ బడ్జెట్‌పై రైతులు, నిరుద్యోగులు, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ఆశ కల్పించారని తెలిపారు. కేంద్ర బడ్జెట్ తెలంగాణకు నిరాశ కలిగించిందని చెప్పారు.


బడే భాయ్ చోటా భాయ్ ప్రేమ బడ్జెట్‌లో కనపడలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవడంలో వైఫల్యం చెందిందన్నారు. పొలిటికల్ ఫెడరలిజంలా ఉందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. దేశ ఆహార భద్రతకి మూలంగా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకపోవడం బాధాకరమని సురేష్ రెడ్డి అన్నారు.


AIBP కింద కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వొచ్చు కదా అని అడిగారు. బయ్యారం స్టీల్ ప్రాజెక్టు, ఐఐఎం,రైల్వే కోచ్ ఫ్యాక్టరీ చాలా పెండింగ్‌లో ఉన్నా సమస్యలను ప్రస్తావించలేదని అన్నారు. కేంద్ర బడ్జెట్‌పై తాము నిరాశ చెందామని చెప్పారు. తెలంగాణకు రావాల్సిన అంశాలపై బీఆర్ఎస్ పోరాడుతుందని సురేష్ రెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - Jul 23 , 2024 | 10:29 PM