KTR: రేవంత్ రెడ్డిని ఉరికించి కొట్టే వారు.. కేటీఆర్ మాస్ వార్నింగ్
ABN , Publish Date - Nov 25 , 2024 | 03:07 PM
రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించే వరకూ తాము పోరాడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.ఫార్మా విలేజీ కోసం 3వేల ఎకరాలు సేకరిస్తామంటే లగచర్ల రైతులు నిరసనకు దిగారని చెప్పారు. 9నెలలుగా వారు నిరసన చేస్తున్నా సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
మహబూబాబాద్ : తెలంగాణ ఉద్యమాన్ని మానుకోట ఘటన మలుపు తిప్పిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. కొత్త నియంత సీఎం రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పేందుకు మానుకోట గడ్డ సిద్ధమైందని హెచ్చరించారు. సీఎం సొంత నియోజకవర్గంలోనే నిరసనలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించే వరకూ తాము పోరాడతామని అన్నారు. రేవంత్ అల్లుడికి ఫార్మా కంపెనీ అప్పగించేందుకే రైతుల భూములు గుంజుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు.
ప్రజల కోసం లబ్ధి చేకూర్చే పనులు చేయకుండా... కుటుంబానికి లాభం చేసేందుకే రేవంత్ పనిచేస్తున్నారని విమర్శించారు. లగచర్లకు అధికారులు పోతే దాడి చేశారని.. రేవంత్ రెడ్డి పోతే ఉరికించి కొట్టే వారని హెచ్చరించారు. ఫార్మా విలేజ్ కోసం 3వేల ఎకరాలు సేకరిస్తామంటే లగచర్ల రైతులు నిరసనకు దిగారని చెప్పారు. 9నెలలుగా వారు నిరసన చేస్తున్నా సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. మహారాష్ట్రలో రేవంత్ రెడ్డిని తన్ని తరిమారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు రాళ్లతో కొడతామంటే భయపడతామనుకున్నారా అని ప్రశ్నించారు. ఇది కేసీఆర్ తయారు చేసిన సైన్యమని అన్నారు. ఊరూరా రేవంత్ రెడ్డి సర్కారుకు బుద్ధి చెప్పేందుకు రెడీగా తమ సైన్యం ఉందని కేటీఆర్ తెలిపారు.
మహబూబాబాద్‌లో భారీ ధర్నా
మహబూబాబాద్‌లో ఇవాళ(సోమవారం) బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహాధర్నా జరిగింది. ఈ ధర్నాలో కేటీఆర్ పాల్గొని రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన, దళితులు, రైతులపై జరుగుతున్న దాడులకు నిరసనగా బీఆర్ఎస్ ధర్నా చేపట్టింది. బీఆర్ఎస్ ధర్నాకు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన అనుమతినిచ్చింది. హైదరాబాద్ నుంచి మహబూబాబాద్‌కు కొత్తగూడెం (పోచంపల్లి X రోడ్), చౌటుప్పల్, చిట్యాల, నార్కట్‌పల్లి, అర్వపల్లి , మరిపెడ బంగ్లా మీదుగా ధర్నాకు కేటీఆర్ చేరుకున్నారు.
ధర్నాలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాజ్యసభ్య సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు రవీందర్ రావు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోతు కవిత, మాజీ ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, రెడ్యానాయక్, బానోత్ హరిప్రియ, పెద్ది సుదర్శన్ రెడ్డి, తాటికొండ రాజయ్య, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్ పర్సన్ బిందు పాల్గొన్నారు. మహబూబాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట స్థానిక బీఆర్ఎస్ నేతలు ధర్నాకు ఏర్పాట్లు చేశారు. బీఆర్ఎస్ ధర్నా సందర్భంగా భారీగా పోలీసులు మోహరించారు. భారీ కాన్వాయ్‌తో మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ నేతలు ర్యాలీ తీశారు. ధర్నాలో మూడువేల పైచిలుకు కార్యకర్తలు పాల్గొన్నారు.
కేసీఆర్ మా పులి.. త్వరలోనే బయటకు వస్తారు: సత్యవతి రాథోడ్
‘‘ మాజీ సీఎం కేసీఆర్ మా పులి.. మాపులి పడుకోని ఉందని.. త్వరలోనే బయటకు వస్తారు’’ అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.బీఆర్ఎస్ ధర్నాలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ నేతలకు సమాధానం చెప్పేందుకు కేటీఆర్ చాలని అన్నారు. కేటీఆర్ తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి అని తెలిపారు. లగచర్ల ఘటనలో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగిందని..వారికి న్యాయం చేయాలని సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సినీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కేసు విచారణ...
బీఆర్ఎస్ మహాధర్నా.. ముఖ్య అతిథిగా కేటీఆర్..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News