Share News

MP Arvind: కాంగ్రెస్ కమీషన్ల సంస్కృతిని కొనసాగిస్తోంది.. బీజేపీ ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Nov 02 , 2024 | 03:15 PM

కాంగ్రెస్ వచ్చి ఏడాది అయినా ఒక్క ప్రాజెక్టు లేదని ఎంపీ అరవింద్ విమర్శించారు. పాదయాత్ర చేస్తే.. జనంతో కేటీఆర్ తన్నులు తింటారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని మాజీ మంత్రి కేటీఆర్ దిగజార్చారని మండిపడ్డారు.పదేళ్లు కళ్లు నెత్తికి ఎక్కి పాలించారని ఎంపీ అరవింద్ ఆరోపించారు.

MP Arvind: కాంగ్రెస్ కమీషన్ల సంస్కృతిని కొనసాగిస్తోంది.. బీజేపీ ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు

జగిత్యాల: కేసీఆర్ దుర్మార్గపు పాలననే కాంగ్రెస్ కొనసాగిస్తోందని బీజేపీ ఎంపీ అరవింద్ విమర్శలు చేశారు. ఇవాళ(శనివారం) జగిత్యాలలో అరవింద్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...బిల్లుల విడుదలకు 7 శాతం కమిషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ చేసిన దరిద్రాన్ని కాంగ్రెస్ ఇంకా దరిద్రం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ వచ్చి ఏడాది అయినా ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. పాదయాత్ర చేస్తే.. జనంతో కేటీఆర్ తన్నులు తింటారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని మాజీ మంత్రి కేటీఆర్ దిగజార్చారని మండిపడ్డారు.పదేళ్లు కళ్లు నెత్తికి ఎక్కి పాలించారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకు ప్రత్యామ్నాయం బీజేపీనే అని అరవింద్ పేర్కొన్నారు.


బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రోటోకాల్ పాటించలేదు: బండి సంజయ్

bandi-sanjay.jpg

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రోటోకాల్ పాటించలేదని, ప్రారంభోత్సవాలు లేవని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. చాలా రోజులకు ప్రోటోకాల్ కనబడిందని చెప్పారు. కాంట్రాక్టర్లను బెదిరించడం, కమీషన్లు దండుకోవడం గతంలో జరిగాయని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారుల మీద ఒత్తిడి తెచ్చిందని..పేరు ప్రఖ్యాతుల కోసం ప్రయత్నం చేసిందని అన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు, ఆ తర్వాత అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని బండి సంజయ్ అన్నారు.

Updated Date - Nov 02 , 2024 | 04:08 PM