Share News

DK Aruna: మార్గదర్శకాల పేరుతో మమ అనిపించే ప్రయత్నం...

ABN , Publish Date - Jul 16 , 2024 | 01:12 PM

Telangana: రేవంత్ సర్కార్ విడుదల చేసిన రుణమాఫీ మార్గదర్శకాలపై పార్లమెంట్ సభ్యురాలు డీ.కే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... రుణమాఫీ అమలులో కాంగ్రెస్ మరోసారి రైతులను మోసం చేసిందని అన్నారు.

DK Aruna: మార్గదర్శకాల పేరుతో మమ అనిపించే ప్రయత్నం...
MP DK Aruna

హైదరాబాద్, జూలై 16: రేవంత్ సర్కార్ విడుదల చేసిన రుణమాఫీ మార్గదర్శకాలపై పార్లమెంట్ సభ్యురాలు డీ.కే అరుణ (MP DK Aruna) ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మోసం చేశారని విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... రుణమాఫీ అమలులో కాంగ్రెస్ మరోసారి రైతులను మోసం చేసిందని అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటలను మర్చిపోయి ఇప్పుడు షరతులు అంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

CM Chandrababu: విశాఖ వాసులకు సీఎం చంద్రబాబు శుభవార్త


ఆనాడు సలహాలు ఎందుకు తీసుకోలేదు?

వరంగల్ డిక్లరేషన్‌లో ఇలాంటి నిబంధనలు లేకుండా ఇస్తామన్నారని... ఇప్పుడేమో రేషన్ కార్డు ఉంటేనే ఇస్తామంటూ లేనిపోని కండిషన్స్ అంటున్నారన్నారు. ఎన్నికలకు ముందు మోసపూరిత హామీలతో ఓట్లేయించుకున్నారని.. ఇప్పుడు అమలు చేయమంటే మార్గదర్శకాల పేరుతో మమ అనిపించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి షరతులు ఉండవు అని ఆనాడు చెప్పునోళ్లు ఇప్పుడు అమలు చేయమంటే జిల్లాలు తిరిగి సూచనలు తీసుకుంటున్నారన్నారు. వరంగల్ డిక్లరేషన్ ఇచ్చినప్పుడు ఇలానే జిల్లాల వారీగా ఎందుకు ప్రజల సలహాలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఆగస్టు 15 వరకు టైం తీసుకున్నారని... ఆరు గ్యారంటీలు అంటూ ఇప్పటికే ప్రజలను కాంగ్రెస్ నిండా ముంచిందన్నారు.

MLA: నేను పరారీ కాలేదు.. నాకు నోటీసులు రాలేదు..


వదలిపెట్టే ప్రసక్తే లేదు...

ఏ ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు పూర్తిగా అమలు చేయలేదని అన్నారు. ఒక్క ఆర్టీసీ బస్‌లో ఫ్రీ ప్రయాణం అంటున్నప్పటికి.. ఆ ఫ్రీ బస్‌తో కూడా మహిళలు హ్యాపీగా లేరన్నారు. ఇప్పటి వరకు రూ. 4000 పెన్షన్ ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ మాటల గారడీ చేస్తోంది తప్పితే.. రేవంత్ సర్కారు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందంటూ వ్యాఖ్యలు చేశారు. ఆరోజు బీజేపీ స్పష్టంగా ఇదే విషయాన్నీ చెప్పినా నమ్మలేదన్నారు. కాంగ్రెస్ ప్రభిత్వానికి చిత్తశుద్ది ఉంటే.. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు షరతులు లేకుండా రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పుర్తిస్థాయిలో రుణమాఫీ అమలు చేసే వరకు కాంగ్రెస్‌ను వదిలే ప్రసక్తే లేదని అన్నారు. పూర్తిస్థాయిలో రుణమాఫీ అమలు చేసే వరకు రైతుల తరపున బీజేపీ పోరాడుతుందని.. అప్పటి వరకు రేవంత్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఎంపీ డీకే అరుణ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

CM Revanth: కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందే..

Drugs Case: డ్రగ్స్ కేసులో ఏ6గా రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 16 , 2024 | 01:15 PM