Share News

TG Politics: హరీశ్.. మీ కుటుంబం అంతా సోనియా కాళ్లు మొక్కలేదా..?

ABN , Publish Date - May 23 , 2024 | 06:51 PM

బీఆర్ఎస్ నేత, మాజీమంత్రి హరీశ్ రావుపై పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సోనియా గాంధీని ఆహ్వానిస్తే తప్పెంటని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కుటుంబ సమేతంగా వెళ్లి సోనియా గాంధీ కాళ్లు మొక్కలేదా అని నిలదీశారు. ఇప్పుడు ఏ హోదాలో సోనియా గాంధీని దశాబ్ది ఉత్సవాలకు ఆహ్వానిస్తున్నారని మాట్లాడటం సరికాదని సూచించారు.

TG Politics: హరీశ్.. మీ కుటుంబం అంతా సోనియా కాళ్లు మొక్కలేదా..?
Parigi Mla Ram Mohan Reddy

హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, మాజీమంత్రి హరీశ్ రావుపై (Harish Rao) పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సోనియా గాంధీని ఆహ్వానిస్తే తప్పెంటని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కుటుంబ సమేతంగా వెళ్లి సోనియా గాంధీ కాళ్లు మొక్కలేదా అని నిలదీశారు. ఇప్పుడు ఏ హోదాలో సోనియా గాంధీని దశాబ్ది ఉత్సవాలకు ఆహ్వానిస్తున్నారని మాట్లాడటం సరికాదని సూచించారు. సోనియా గాంధీ దయ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తుచేశారు. యువకుల ఆత్మహత్యలు చూసి, బీడు బారిన ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలని, నిధులతో తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలని ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని తేల్చిచెప్పారు. తెలంగాణ బాధ చూడలేక రాష్ట్రం ఇస్తే జీతాలు ఇవ్వలేని పరిస్థితికి తీసుకువెళ్ళారని బీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు.


సోనియా గాంధీని తెలంగాణ దేవతగా ప్రజానీకం గౌరవిస్తున్నారని రామ్మోహన్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ వ్యతిరేకులకు విందు భోజనాలు ఏర్పాటు చేసింది మీరు.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వ్యక్తులను మంత్రివర్గంలోకి తీసుకున్న ఘనత మీది..? బీజేపీ, సుష్మా స్వరాజ్ తెలంగాణ ఏర్పాటు విషయంలో సోనియా గాంధీని ప్రశంసించారని రామ్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. రైతు వ్యతిరేక చట్టాలకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చిందని రామ్మోహన్ రెడ్డి విమర్శించారు.


సన్న వడ్లతో బోనస్ ప్రారంభించి.. దొడ్డు వడ్లకు కొనసాగిస్తామని రామ్మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. ఎక్కడ కూడా సీఎం రేవంత్, మంత్రులు దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వమని చెప్పలేదన్నారు. మహేశ్వర్ రెడ్డి దగ్గర ఆధారాలు కాదు ఎన్ని టన్నుల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసిందనే డాటా కూడా తప్పుగా ఉందని మండిపడ్డారు.


Read Latest Telangana News and National News


Updated Date - May 23 , 2024 | 06:51 PM