Share News

Balmuri Venkat: చీకటి కోణాలు బయటపడతాయనే ఈ డ్రామాలు.. బలుమూరి వెంకట్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Oct 29 , 2024 | 09:47 PM

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆంబోతు లెక్క తయారయ్యారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బలుమూరి వెంకట్ విమర్శించారు. ఊర్లో పెళ్లికి కుక్కల హడావుడి అన్నట్లుగా ఆయన వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. కౌశిక్ రెడ్డిని కానిస్టేబుల్ అడ్డుకున్నా... సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుని ఫేమస్ అవడానికి చిల్లర పనులు చేస్తారని ఎమ్మెల్సీ బలుమూరి వెంకట్ సెటైర్లు గుప్పించారు.

Balmuri Venkat: చీకటి కోణాలు బయటపడతాయనే ఈ డ్రామాలు.. బలుమూరి వెంకట్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫామ్ హౌస్‌ కేసు ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసుకు సంబంధించిన విషయాలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బలుమూరి వెంకట్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇవాళ(మంగళవారం)గాంధీ భవన్‌లో బలుమూరి వెంకట్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేటీఆర్‌, బీఆర్ఎస్‌పై బలుమూరి వెంకట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆంబోతు లెక్క తయారయ్యారని విమర్శించారు. ఊర్లో పెళ్లికి కుక్కల హడావుడి అన్నట్లుగా ఆయన వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. కౌశిక్ రెడ్డిని కానిస్టేబుల్ అడ్డుకున్నా... సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుని ఫేమస్ అవడానికి చిల్లర పనులు చేస్తారని ఎమ్మెల్సీ బలుమూరి వెంకట్ సెటైర్లు గుప్పించారు.


‘‘నీకు రాజకీయ భిక్ష పెట్టిన వారిని వెన్నుపోటు పొడిచావు. ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేశావు. ఆఖరికి నీ పీఏల దగ్గర కూడా ఉద్యోగాలు పెట్టిస్తా అని డబ్బులు వసూలు చేశావ్. డ్రగ్స్ టెస్ట్ ఎక్కడ ఇయ్యాలో కూడా నీకు తెలియదు. కొకైన్ తీసుకునే వాడితో నీకేం సంబంధమో చెప్పు.కేటీఆర్ బావమరిది తప్పు చేయకపోతే.. మీ ఎమ్మెల్యేలు పోలీసులను ఎందుకు అడ్డుకున్నారు. కోర్టుకు ఎందుకు వెళ్లారు. చీకటి కోణాలు బయటపడతాయనే ఈ డ్రామాలు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పార్టీ సమావేశాలు పెడితే కూడా ప్రతిపక్షాల నేతలను అరెస్ట్ చేశారు. ఇప్పుడా పరిస్థితి తెలంగాణలో ఉందా..మీరు ఎక్కడ ధర్నా చేసినా అనుమతి ఇస్తున్నాం. గెలవడానికి బిడ్డను అడ్డం పెట్టుకున్న నీచుడు కౌశిక్ రెడ్డి. గ్యాస్ట్రో ఏంట్రాలజీ నాగేశ్వర్ రావు దగ్గర శాంపిల్ ఇస్తామని అంటున్నారు. గ్యాస్ట్రో ఎంటరాలజీకి, డ్రగ్ టెస్ట్‌కు ఏం సంబంధం అనడానికి సిగ్గుండాలి. కొకైన్ తీసుకున్న వారితో మీకున్న సంబంధం ఏంటి. మీ బాస్ కేటీఆర్ సమాధానం చెప్పాలి. కేటీఆర్ కూడా డ్రగ్స్ తీసుకుంటున్నాడనే అనుమానం కలుగుతోంది. డ్రగ్ టెస్ట్ చేసుకుందామని సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచో కేటీఆర్‌కు సవాల్ విసిరారు. కేటీఆర్ పారి పోయిండు. రేవంత్ రెడ్డిని విమర్శిస్తే బయట తిరగనియ్యం.’’ అని బలుమూరి వెంకట్ హెచ్చరించారు.


ఎస్.ఎల్.బీ.సీ పూర్తి చేసి సాగునీటి కష్టాలు పరిష్కరిస్తాం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Komatireddy-Venkat-Reddy-(2.jpg

నల్గొండ: మట్టిరోడ్లు లేని రాష్ట్రంగా తెలంగాణను మారుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. రాష్ట్రాన్ని మౌలిక సదుపాయల కల్పనలో నెంబర్ -1గా మారుస్తామని చెప్పారు. రోడ్లేయడమంటే.. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడంలో భాగమేనని అన్నారు. ఎస్.ఎల్.బీ.సీ పూర్తి చేసి నల్గొండ సాగునీటి కష్టాలు పరిష్కరిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.


పాలమూరుపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపారు: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి

Yennam-Srinivas-Reddy-Mahab.jpg

మహబూబ్ నగర్: సీఎం రేవంత్‌రెడ్డి పాలమూరుపై ప్రత్యేక శ్రద్ధ చూపారని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి తెలిపారు. విద్య విషయంలో మహబూబ్ నగర్‌కు ఒక గోల్డెన్ ఛాన్స్ వచ్చిందని అన్నారు. బీఆర్ఎస్ నేతల్లాగా చిల్లర మల్లర మాటలు తాము మాట్లాడామని చెప్పారు. రేపు(బుధవారం) పాలమూరు విశ్వ విద్యాలయంలో సీఎం రేవంత్‌రెడ్డికి, మంత్రి వర్గానికి అభినందన సభ ఉంటుందని తెలిపారు. తమకు బేషజాలు లేవని... పని ఉంటే ఒక క్లర్క్ వద్దకైనా పది సార్లు తిరుగుతానని స్పష్టం చేశారు.


విద్యార్థులు, మేధావులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. పాలమూరులో ఇంజనీరింగ్, లా కాలేజీలు మంజూరు చేశారని తెలిపారు. తాము గత పది నెలలుగా పడ్డ శ్రమకు ఫలితమిదని చెప్పారు. తెలంగాణలో ఉస్మానియా, కాకతీయ, జెఎన్‌టీయూలో మాత్రమే క్యాంపస్‌లలో ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయని... అలాంటిది మన పాలమూరు విశ్వ విద్యాలయంలో రావడం ఈ జిల్లా అదృష్టమని అన్నారు. యూనివర్సిటీలో అన్ని బ్రాంచీలు ఉంటే దానికి యూజీసీలో రేటింగ్ పెరుగుతుందని తెలిపారు.


మొత్తం దక్షిణ భారత దేశంలో రెండు యూనివర్సిటీలకు మాత్రమే కేంద్రప్రభుత్వం రూ.100 కోట్లను ఇచ్చిందని.. అందులో పాలమూరు యూనివర్సిటీ కూడా ఉందని గుర్తుచేశారు. ఆర్థిక పరిస్థితి తెలంగాణలో బాగా లేదని చెప్పారు. ఒక ఇంకుబేషన్ సెంటర్, హాస్టల్‌కు, కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చెప్పారు. వచ్చే ఏడాది ఇంజనీరింగ్ కాలేజీ తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. సీఎం రేవంత్ చేతుల మీదుగా త్వరలో పనులు ప్రారంభించాలని నిర్ణయించామని అన్నారు. పాలమూరు యునివర్సిటీ తెలంగాణలో పేరెన్నిక గలదిగా చేస్తామని ఉద్ఘాటించారు. ఐఐటీలతో టై అప్ చేస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

Updated Date - Oct 29 , 2024 | 09:47 PM