TS Politics: రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్‌లో చేరికకు బ్రేక్
ABN , Publish Date - Apr 22 , 2024 | 10:29 AM
Telangana: రాజేంద్రనగర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ కాంగ్రెస్‌లో చేరతారంటూ గత కొద్దిరోజులుగా వినిపించిన వార్తలకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. అయితే ప్రకాష్‌గౌడ్ వ్యతిరేక వర్గం మాత్రతం కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. మూడు రోజుల కింద సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ఎమ్మెల్యే కలిశారు.
హైదరాబాద్, ఏప్రిల్ 22: రాజేంద్రనగర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ (BRS MLA Prakash Goud) కాంగ్రెస్‌లో (Congress) చేరతారంటూ గత కొద్దిరోజులుగా వినిపించిన వార్తలకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. అయితే ప్రకాష్‌గౌడ్ వ్యతిరేక వర్గం మాత్రతం కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. మూడు రోజుల కింద సీఎం రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ఎమ్మెల్యే కలిశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌లో చేరికపై ప్రకాష్ గౌడ్ సుముఖత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
AP Elections: ఆఖరి నిమిషంలో అనూహ్య పరిణామం.. పాడేరు టికెట్ గిడ్డి ఈశ్వరికే ఎందుకు..!?
ఈ వార్తలపై వెంటనే స్పందించిన బీఆర్‌ఎస్ అధిష్టానం ఆయనతో చర్చలు జరిపింది. ఎమ్మెల్యేతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. కేటీఆర్‌తో భేటీ అనంతరం ప్రకాష్ గౌడ్ మనసు మార్చుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రకాష్ గౌడ్ చేరిక వాయిదా వాడినట్లైంది. అయితే ఎమ్మెల్యేకు చెందిన వ్యతిరేక వర్గం మాత్రం కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంది. బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎమ్మెల్యేపై తిరుగుబాటు చేసిన కార్పొరేటర్లను కాంగ్రెస్ తమ పార్టీకి చేర్చుకోనుంది. ఇటీవలే ప్రకాష్ గౌడ్ దగ్గరి వ్యక్తి మహేందర్ గౌడ్‌ను మేయర్ పదవి నుంచి ప్రకాష్ గౌడ్ వ్యతిరేక వర్గం దింపేసింది. దాదాపు 22 మంది కార్పొరేటర్లలో 16 మంది కార్పొరేటర్లు ప్రకాష్ గౌడ్‌కు వ్యతిరేకంగా వ్యవహరించారు. ఆ 16 మంది కార్పొరేటర్లు మరికాసేపట్లో కాంగ్రెస్ గూటికి చేరనున్నారు.
ఇవి కూడా చదవండి...
Attack On YS Jagan: వైఎస్ జగన్‌పై గులకరాయి దాడి కేసులో కొత్త అనుమానాలు.. అసలేం జరిగింది..!?
Pawan Kalyan: పవన్ సభలో కత్తులతో కలకలం.. ఏకంగా పోలీసులపైనే..!?
మరిన్ని ఏపీ వార్తల కోసం...