AP News: సుచరిత అనుచరుల అరాచకాలపై డిల్లీలో వేలు కట్ చేసుకుని మరీ మహిళ నిరసన
ABN , Publish Date - Apr 22 , 2024 | 08:07 AM
ఏపీలో అరాచకాలపై డిల్లీలో ఓ మహిళా నిరసనకు దిగింది. ఇండియా గేట్ వద్ద బోటన వేలు కట్ చేసుకుని మరీ నిరసన కొనసాగించింది. మాజీ హోం మంత్రి సుచరిత అనుచరుల అరచకాలపై ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌లకు ఫిర్యాదు చేసేందుకు డిల్లీకి బాధిత మహిళలు వెళ్లారు.
గుంటూరు: ఏపీలో అరాచకాలపై డిల్లీలో ఓ మహిళా నిరసనకు దిగింది. ఇండియా గేట్ వద్ద బోటన వేలు కట్ చేసుకుని మరీ నిరసన కొనసాగించింది. మాజీ హోం మంత్రి సుచరిత అనుచరుల అరచకాలపై ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌లకు ఫిర్యాదు చేసేందుకు డిల్లీకి బాధిత మహిళలు వెళ్లారు. ముగ్గురినీ కలిసే అవకాశం లేకపోవడం బోటన వేలు కోసుకుని నిరసన వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ 41 డివిజన్‌లో భూకబ్జాలు, గంజాయి అమ్మకాలపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాజీ హోం మంత్రి సుచరిత అనుచరుల అరాచకాలపై కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. స్థానిక, జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదు. బాధిత మహిళలతో కలిసి కొవూరి లక్ష్మి డిల్లీ వెళ్లారు. ఇండియా గేట్ వద్ద ఆమె తన బొటన వేలు కోసుకున్నారు.
Attack On YS Jagan: వైఎస్ జగన్‌పై గులకరాయి దాడి కేసులో కొత్త అనుమానాలు.. అసలేం జరిగింది..!?
మరిన్ని ఏపీ వార్తల కోసం..