Share News

Srinivas Goud: తెలంగాణలో లబ్ధి పొందింది.. ఆంధ్రవాళ్లే.. శ్రీనివాస్ గౌడ్ షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Dec 19 , 2024 | 09:41 AM

ఏపీపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత శ్రీనివాస్ గౌడ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. దేవుడు ముందు అంతా సమానమేనని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ ప్రజల పట్ల వివక్ష చూపితే..రాబోయే రోజుల్లో తెలంగాణలో ఆంధ్రా వారికీ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.

Srinivas Goud: తెలంగాణలో లబ్ధి పొందింది.. ఆంధ్రవాళ్లే.. శ్రీనివాస్ గౌడ్ షాకింగ్ కామెంట్స్

తిరుమల: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారీగా లబ్ధి చెందింది ఆంధ్రా వాళ్లే అనే మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇవాళ(గురువారం) తిరుమల శ్రీవారిని శ్రీనివాస్ గౌడ్ దర్శించుకున్నారు. దేవుడు ముందు అందర్ని సమానంగా చూడాలని తెలిపారు. తెలంగాణ ప్రజలు, ప్రజాప్రతినిధుల పట్ల టీటీడీ వివక్ష చూపుతావుంది..ఇది మంచి పరిణామం కాదని అన్నారు.


తెలంగాణలో వ్యాపారాలు చేస్తూ లబ్ధి పొందుతున్నది ఆంధ్రా వాళ్లే..పదవుల్లో లబ్ధి పొందుతున్నది వారేనని షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ ప్రజల పట్ల వివక్ష చూపితే..రాబోయే రోజుల్లో తెలంగాణలో ఆంధ్రా వారికీ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అన్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధులకు గతంలో కల్పిస్తున్న సౌకర్యాలను కూటమి ప్రభుత్వం పునరుద్ధరించాలని కోరారు. టీటీడీ చైర్మన్‌కి పూర్తి స్వేచ్చ ఇస్తే..తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.


మా లేఖలను పరిగణనలోకి తీసుకోవాలి: కేటీఆర్

ktr-cm-revanth.jpg

కాగా.. తిరుమలకు వచ్చే తెలంగాణ భక్తుల దర్శనానికి ఇక్కడి ప్రజాప్రతినిధులైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇచ్చే లేఖలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌ బీఆర్‌ నాయుడును బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ కోరారు. రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన ఆలయాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని, కరీంనగర్‌, సిరిసిల్లలో గతంలో శంకుస్థాపన చేసిన టీటీడీ దేవాలయాల నిర్మాణాలు శరవేగంగా పూర్తిచేయాలని బీఆర్‌ నాయుడును కేటీఆర్‌ విన్నవించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

CM Revanth Reddy: అదానీకి ప్రధాని అండ

AV Ranganath: ఆక్రమణదారులపై పీడీ యాక్ట్‌.. హైడ్రా పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు తర్వాత చర్యలు

Hyderabad: అనుమతి నుంచి రెన్యూవల్‌ వరకు అంతా ఆన్‌లైన్‌లోనే..

Read Latest Telangana News and Telugu News

Updated Date - Dec 19 , 2024 | 09:48 AM