Telangana: ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే ఆ పని చేయండి.. డీజీపీ కీలక సూచన..
ABN , Publish Date - Jul 19 , 2024 | 04:51 PM
హైదరాబాద్, జులై 19: పోలీసు సిబ్బంది పేరుతో ఫేక్ కాల్స్ చేసి సామాన్య ప్రజల నుంచి డబ్బులు గుంజుతున్న మోసగాళ్ల విషయంలో అలర్ట్‌గా ఉండాలని తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) డాక్టర్ జితేందర్ రాష్ట్ర ప్రజలకు సూచించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆయన..
హైదరాబాద్, జులై 19: పోలీసు సిబ్బంది పేరుతో ఫేక్ కాల్స్ చేసి సామాన్య ప్రజల నుంచి డబ్బులు గుంజుతున్న మోసగాళ్ల విషయంలో అలర్ట్‌గా ఉండాలని తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) డాక్టర్ జితేందర్ రాష్ట్ర ప్రజలకు సూచించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆయన.. ఉదాహరణగా ఒక వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో మోసగాళ్లు పోలీస్ అధికారి ఫోటోను డీపీగా పెట్టుకుని బాధితులకు కాల్ చేశారు. సైబర్ నేరగాడు బాధితులకు కాల్ చేసి.. ‘మీ కొడుకు తతన స్నేహితులతో కలిసి ఒక మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. అతన్ని జైల్లో వేశాము.’ అంటూ వారిని బ్లాక్ మెయిల్ చేశాడు. ఇదే విషయాన్ని పేర్కొంటూ రాష్ట్ర డీజీపీ.. ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఇలాంటి ఘటనలు ఎదురైతే.. ఏమాత్రం సంకోచించకుండా 1930 కి ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాలన్నారు.
తెలంగాణ డీజీపీ పోస్ట్..
‘‘ఇలా పోలీస్ డీపీ ఫోటో పెట్టుకున్న అపరిచితులు ఫోన్ చేసి మీకు సంబంధించిన వాళ్లు పట్టుబడ్డారని, లేదా వాళ్ల పేరు మీద ఇల్లీగల్ డ్రగ్స్ కొరియర్లు వచ్చాయని, వాళ్లు ఇంకేదో పెద్ద తప్పు పని చేశారని మిమ్మల్ని టెన్షన్లో పెట్టి బురిడీ కొట్టిస్తారు. అలాంటి ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి.’’ అని డీజీపీ పోస్ట్ చేశారు.
ఆన్‌లైన్ పార్శిల్ స్కామ్..
ఇటీవలి కాలంలో మన దేశంలో ఆన్‌లైన్ పార్శిల్ స్కామ్‌లు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన రాష్ట్ర పోలీసులు.. ఇలాంటి మోసాలపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. స్కామ్ కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నిందితులు VOIP కాల్స్, డైరెక్ట్ ఇంటర్నేషనల్ నెంబర్స్ నుంచి కాల్స్ చేస్తారు. తాము మొంబై పోలీసులు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల అధికారులమని చెబుతారు. బాధితుల బంధువులు పెద్ద కేసులో ఇరుక్కున్నట్లు నమ్మిస్తారు. ముంబై నుంచి విదేశాలకు మీ పేరుతో ఇల్లీగల్ పార్శిల్స్ వచ్చాయని భయబ్రాంతులకు గురి చేస్తారు. ఈ కేసులో వివరాలను ధృవీకరణ కోసమంటూ.. ఆధార్ సహా అన్ని వివరాలను కోరతారు. ఆ తరువాత ఈ కేసు నుంచి తప్పించాలంటే కొంత మొత్తం డబ్బులు చెల్లించాలని.. లేదంటే జైల్లో జీవితాంతం ఉండాల్సి వస్తుందని భయపెడతారు. అయితే, ఇలాంటి ఫోన్ కాల్స్‌ని, వారి మాటలను నమ్మొద్దని చెబుతున్నారు పోలీసులు. వీటిని నమ్మి ఎవరైనా వారికి డబ్బులు పంపించినా.. ఆర్థిక పరమైన వివరాలు అందించినా.. తీవ్ర నష్టం తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇటీవలి కాలంలో ఇలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని.. ముఖ్యంగా విద్యావంతులు, ఉన్న ఉద్యోగులే మోసాలకు గురవుతున్నారని పోలీసులు చెబుతున్నారు. గుర్తు తెలియని కాల్స్, అప్లికేషన్స్ వస్తే వాటిని అటెండ్ చేయొద్దని.. వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ చెప్పొద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఇలా ఎవరైనా కాల్స్, మెసేజ్ చేస్తే స్థానిక పోలీస్ స్టేసన్‌లో కంప్లైంట్ ఇవ్వాలని చెబుతున్నారు. లేదంటే.. 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చని సూచిస్తున్నారు.