Vinod Kumar: అప్పుడు కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే.. భట్టి విక్రమార్కకు సూటి ప్రశ్న
ABN , Publish Date - Jun 21 , 2024 | 03:47 PM
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బొగ్గు గనుల వేలం బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందనడాన్ని ఖండిస్తున్నానని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ (Boinapalli Vinod Kumar) అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బొగ్గు గనుల వేలం బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందనడాన్ని ఖండిస్తున్నానని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ (Boinapalli Vinod Kumar) అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. భట్టి అవగాహన ఉండి కూడా అబద్ధాలు మాట్లాడుతున్నారా? లేక అవగాహన లేక మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో ఈరోజు (శుక్రవారం) వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ... 2011లో ఆ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిందే కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వమని స్పష్టం చేశారు.
ఆ తర్వాత కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపు ఆర్డినెన్సు రూపంలో చట్టం చేసిందన్నారు. బిల్లు పెట్టింది కాంగ్రెస్, ఆర్డినెన్సు తెచ్చింది బీజేపీ అని తేల్చిచెప్పారు. భట్టి విక్రమార్క వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. సెక్షన్ 17కింద యాక్షన్ లేకుండా బొగ్గు గనులు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వొచ్చని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి, భట్టి కేంద్రం వద్దకు వెళ్లాలి..బొగ్గుగని వేలంను ఆపాలని హితవు పలికారు. తాము మద్దతు ఇచ్చాయనే మాటను విక్రమార్క ఉపసంహరించుకోవాలని కోరారు. సింగరేణిని చంపేయడానికి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి సంబంధించిన 8మంది ఎంపీలను గెలిపించారా అని ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Telangana: పోచారంపై షాకింగ్ కామెంట్స్ చేసిన మాజీ మంత్రి..
Bhatti Vikramarka: తెలంగాణ బొగ్గు బ్లాక్‌లను ప్రైవేట్ సంస్థలకు కేటాయించటం బాధాకరం