Gangula Kamalakar: బండి సంజయ్‌ని కరీంనగర్ ఎంపీగా గెలిపిస్తే ఒక్కరూపాయి కూడా తీసుకురాలేదు
ABN , Publish Date - Jan 04 , 2024 | 08:40 PM
బీజేపీ ( BJP ) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ( Bandi Sanjay ) ని కరీంనగర్‌లో గెలిపిస్తే ఒక్కరూపాయి కూడా తీసుకురాలేదని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ( Gangula Kamalakar ) ఎద్దేవా చేశారు. గురువారం నాడు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... బండి సంజయ్‌ని ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్‌ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదన్నారు. గ్రామగ్రామాన అభివృద్ధి చేసింది.. ఆనాటి ఎంపీ వినోద్ కుమార్ మాత్రమేనని గంగుల కమలాకర్ తెలిపారు.
హైదరాబాద్: బీజేపీ ( BJP ) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ( Bandi Sanjay ) ని కరీంనగర్‌లో గెలిపిస్తే ఒక్కరూపాయి కూడా తీసుకురాలేదని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ( Gangula Kamalakar ) ఎద్దేవా చేశారు. గురువారం నాడు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... బండి సంజయ్‌ని ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్‌ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదన్నారు. గ్రామగ్రామాన అభివృద్ధి చేసింది.. ఆనాటి ఎంపీ వినోద్ కుమార్ మాత్రమేనని తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం స్థాయిలో బీఆర్ఎస్‌ని బలోపేతం చేస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరి పార్లమెంట్ ఎన్నికలకు కూడా కష్టపడి పని చేస్తామని గంగుల కమలాకర్ చెప్పారు.
కాంగ్రెస్ 6 గ్యారెంటీలను అమలు చేయట్లేదు
బండి సంజయ్ ఎంపీగా ఉండి కేంద్రం నుంచి రైల్వే లైన్లు ఏ ఒక్కటి కూడా తీసుకురాలేదని మండిపడ్డారు.ఈసారి వినోద్ కుమార్‌ను కరీంనగర్‌లో గెలిపించుకుంటామని పేర్కొన్నారు. మంత్రి శ్రీధర్ బాబు చాలా మాట్లాడుతున్నారని.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు డిసెంబర్ 9వ తేదీన అమలు చేస్తామన్నారని ఇంతవరకు 6 గ్యారెంటీలను హామీలు చేయడం లేదన్నారు. రైతు బంధు ఇప్పటి వరకు ఇవ్వలేదని, రుణమాఫీ ఇప్పటికీ కాలేదన్నారు. కాంగ్రెస్ నేతల మాటలు నమ్మి జనం ఓటేస్తే 6 గ్యారెంటీలను నెరవేర్చారా అని గంగుల కమలాకర్ ప్రశ్నించారు.