Share News

Mynampally Vs Harish: హరీశ్.. నువ్వో- నేనో తేల్చుకుందాం రా!

ABN , Publish Date - Aug 20 , 2024 | 04:58 PM

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌కు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు ఛాలెంజ్ చేశారు. ‘తెలంగాణ, సిద్దిపేట.. నీ యబ్బ జాగీరా..? రుణమాఫీ 200 శాతం అమలు చేస్తున్నాం.. హరీశ్.. మరీ నీ సంగతి ఏంది..? మైనంపల్లి పీడ పోవాలంటే నువ్వు రాజీనామా చెయ్యి. నువ్వు రాజీనామా చేస్తే ఎన్నికల్లో నేనూ పోటీ చేస్తా..’ అని సవాల్ చేశారు..

Mynampally Vs Harish: హరీశ్.. నువ్వో- నేనో తేల్చుకుందాం రా!
MLA Mynampally hanumantha rao

సిద్దిపేట, ఆగస్టు 20: సిద్దిపేటలో కాంగ్రెస్ (Congress) భారీ ర్యాలీ చేపట్టింది. హైదారాబాద్ నుంచి రాజీవ్ రహదారి మీదుగా వందలాది వాహనాల కాన్వాయ్‌తో కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు (Mynampally hanumantha rao) సిద్దిపేటకు చేరుకున్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా పొన్నాల సమీపంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా సిద్దిపేటకు చేరుకుని స్థానిక పాత బస్టాండ్ వద్ద మీడియా సమావేశంలో మైనంపల్లి మాట్లాడుతూ.. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పాం చేశామన్నారు.

KTR: రేవంత్ సర్కార్‌పై బీఆర్ఎస్ పోరాటం.. ఎల్లుండి ధర్నాకు పిలుపు


నమొద్దు.. నమొద్దు!

హరీశ్ రావు, కల్వకుంట్ల మాటలు నమొద్దని... రుణమాఫీ జీవితకాలంలో సాధ్యం కాదని మాజీ సీఎం కేసీఆర్ అన్న విషయాన్ని గుర్తుచేశారు. రుణమాఫీ కావద్దని బీఆర్‌ఎస్‌కు ఉందన్నారు. ప్రతిపక్షంగా మంచి సూచనలు ఇవ్వడం మాని అలజడులు చేస్తున్నారని మండిపడ్డారు. రుణమాఫీ సమస్యలు ఉంటే కాంగ్రె నాయకుల్ని, కార్యకర్తలను సంప్రదించాలని.. వెంటనే రైతుల సమస్యల్ని పరిష్కరిస్తామని తెలిపారు. రాహుల్ గాంధీ ఇచ్చిన గైడ్ లైన్స్ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారన్నారు. 40 ఏళ్లుగా కేసీఆర్, హరీశ్ రావు సిద్దిపేటలో వెలుగు వెలుగుతున్నారన్నారు.


మీరు బలి కావొద్దు..!

‘‘మేము సిద్దిపేటకు వస్తున్నామని కారం చల్లాలని, తరిమికొట్టండని బీఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలకు చెప్పారట. మేము బీఆర్‌ఎస్‌లో ఎలా బలి అయ్యమో అలా మీరు బలి కావద్దు. పార్టీలు ఏవైనా వాళ్ళంతా మా కార్యకర్తలే. మేము కార్యకర్తలను ఏమి ఆనం.. నేరుగా హరీశ్ రావు పైనే దాడులు చేస్తాం. బీఆర్‌ఎస్ కార్యకర్తలు మాపైన దాడి చేస్తే హరీశ్ రావు‌ను గెరవ్ చేస్తాం. హరీశ్ రావు, కల్వకుంట్ల సభ్యులు జైలుకు వెళ్లే వరకు రేవంత్ రెడ్డి ఊరుకోరు. మా ఫ్లెక్సీలు చించి వేశారు... ఎప్పుడైనా గతంలో బీఆర్‌ఎస్ ఫ్లెక్సీలను మేము చింపినామా ? ప్రజాస్వామ్యం గురించి ఇప్పుడు వీళ్లు మాట్లాడుతున్నారు. క్యాంప్ కార్యాలయంలో మీ మామ ఫోటో ఎట్లా పెడతారు. క్యాంప్ ఆఫీస్ ప్రభుత్వ ఆస్తి.. ప్రభుత్వ ఆస్తిలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఉండాలి. ఈ విషయం హరీశ్ రావుకు తెలియదా ? మేము ఈరోజు ర్యాలీకి అనుమతి తీసుకున్నాం.. కానీ ఇదే రోజు బీఆర్‌ఎస్ సమావేశం పెట్టమనడం ఎంత వరకు సమంజసం. మమ్మల్ని రెచ్చగొట్టడం కాదా? ఉద్యమ కారులను వాడుకోవడం తప్ప బీఆర్‌ఎస్ నాయకులకు ఇంకేం తెలుసు’’ అని ప్రశ్నించారు.

Kolkata doctor Case: రంగంలోకి ఆ సీబీఐ అధికారి.. న్యాయంపై అభయ తల్లిదండ్రుల విశ్వాసం..!


నా.. పీడ పోవాలంటే..!

రంగనాయక సాగర్ పేరిట పేదల భూములు లాక్కుని ఫాం హౌస్ ఏర్పాటు చేసుకున్న చరిత్ర హరీశ్ రావుది అని ఆరోపించారు. డిఎక్సెన్ పేరిట మూడు వేలకు ఎకరం భూమి కొల్లగొట్టారని మండిపడ్డారు. ‘‘తెలంగాణ, సిద్దిపేట.. నీ యబ్బ జాగీరా..? రుణమాఫీ 200 శాతం అమలు చేస్తున్నాం.. హరీశ్.. మరీ నీ సంగతి ఏంది..? మైనంపల్లి పీడ పోవాలంటే నువ్వు రాజీనామా చెయ్యి. నువ్వు రాజీనామా చేస్తే ఎన్నికల్లో నేనూ పోటీ చేస్తా.. నేను ఓడితే మళ్ళీ రాజకీయాలు చేయను..! నువ్వు సిద్ధమా..? నువ్వు ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకోవాలి. ట్రంక్ పెట్టెతో వచ్చి లక్షలు దోచుకున్నారు. నేను డక్ ఔట్ కావడానికైనా, సెంచరీ కొట్టడానికి అయినా సిద్ధం. బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసినప్పుడు.. మెదక్, సిద్దిపేటలో అమరవీరుల కుటుంబానికి అవకాశం ఇద్దామనీ అన్నా.. అయినా హరీశ్ ముందుకు రాలేదు. మళ్ళీ చెబుతున్నా రాజకీయాల్లో నువ్వన్న ఉండాలి లేదా నేనన్నా ఉండాలి’’ అంటూ మైనంపల్లి హనుమంత్ రావు సవాల్ విసిరారు.


ఇవి కూడా చదవండి...

Viral Video: స్కూటీలో రోడ్డుపైకి వచ్చిన వ్యక్తి.. చూస్తుండగానే వాహనంతో పాటూ..

Jogi Ramesh: జోగికి మరోసారి నోటీసులు... విచారణకు గైర్హాజరు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 20 , 2024 | 05:36 PM