Photo: ఫొటోకు ఫోజులిస్తూ అగ్నిపర్వతంలో పడిపోయిన టూరిస్ట్
ABN , Publish Date - Apr 23 , 2024 | 03:49 PM
: విహారంలో విషాదం నెలకొంది. భర్తతో కలిసి పర్యటనకు వెళ్లిన భార్య ఫొటోల మీద ఉన్న క్రేజుతో ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఈ విషాద ఘటన ఇండోనేషియాలో జరిగింది.
ఏబీఎన్ ఇంటర్నెట్ డెస్క్: విహారంలో విషాదం నెలకొంది. భర్తతో కలిసి పర్యటనకు వెళ్లిన భార్య ఫొటోల మీద ఉన్న క్రేజుతో ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఈ విషాద ఘటన ఇండోనేషియాలో (Indonesia) జరిగింది.
చైనాకు చెందిన హువాంగ్ లిహోంగ్ భర్తతో కలిసి ఇండోనేషియా వెళ్లింది. అక్కడ గల ఇజెన్ పార్క్‌కు శనివారం నాడు వెళ్లారు. అగ్నిపర్వతం అంచున నిలబడి ఫొటోలకు ఫోజులిచ్చింది. ప్రమాదవశత్తూ కాలు జారి అగ్నిపర్వంలో పడి చనిపోయింది. పర్వతం అంచున నిలబడొద్దని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు. ఫొటో తీసుకునే క్రమంలో లాంగ్ డ్రెస్ కాళ్లకు తట్టుకొని పడిపోయారు.
అగ్నిపర్వతాలకు ఇండోనేషియా ఫేమస్. ఇజెన్ అగ్నిపర్వతం సల్ఫ్యూరిక్ ఆసిడ్ నుంచి బ్లూ ఫైర్ వెలువడుతుంది. 2018లో అగ్నిపర్వతం విషవాయువులను విడుదల చేసింది. దాంతో అక్కడ ఉన్న ప్రజలను ఇళ్ల నుంచి ఖాళీ చేయించారు. తర్వాత అది తగ్గడంతో పర్యాటకులను సందర్శనకు అనుమతి ఇచ్చారు. విహారం కోసం అగ్నిపర్వతం వద్దకువెళ్లి ఆ మహిళ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.
ఇది కూడా చదవండి:
Earthquakes: 24 గంటల్లోనే 80కి పైగా భూకంపాలు..కూప్పకూలిన భవనాలు
Read Latest International News or Telugu News