Share News

Viral Video: ఆ వ్యక్తి తెలివితేటలకు ఫిదా కావాల్సిందే.. కార్ సైడ్ మిర్రర్ పగిలినపుడు ఏ చేశాడంటే..

ABN , Publish Date - Apr 23 , 2024 | 03:55 PM

హిందీలో జుగాడ్ అనే పదం బాగా పాపులర్. దీనికి తెలుగులో సత్వర పరిష్కారం, తెలివైన పరిష్కారం అనే అర్థాలు వస్తాయి. ఏదైనా సమస్య వచ్చినపుడు బ్రెయిన్ ఉపయోగించి పరిష్కారాలను కనుగొనే మనస్తత్వం అనే అర్థంలో జుగాడ్ అనే పదాన్ని వాడతారు.

Viral Video: ఆ వ్యక్తి తెలివితేటలకు ఫిదా కావాల్సిందే.. కార్ సైడ్ మిర్రర్ పగిలినపుడు ఏ చేశాడంటే..
car

హిందీలో జుగాడ్ (Jugaad) అనే పదం బాగా పాపులర్. దీనికి తెలుగులో సత్వర పరిష్కారం, తెలివైన పరిష్కారం అనే అర్థాలు వస్తాయి. ఏదైనా సమస్య వచ్చినపుడు బ్రెయిన్ ఉపయోగించి పరిష్కారాలను కనుగొనే మనస్తత్వం అనే అర్థంలో జుగాడ్ అనే పదాన్ని వాడతారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ జుగాడ్ వీడియోలు (Jugaad Videos) బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు (Viral Videos).


jibran_jazzy అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. మహారాష్ట్రలో ఈ వీడియోను చిత్రీకరించారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ ఎలక్ట్రిక్ కారు (Car) ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగి ఉంది. అయితే ఆ కారు సైడ్ మిర్రర్ (Side mirror) పగిలిపోయి ఉంది. అయితే ఆ కారు యజమాని దానికి తెలివైన పరిష్కారం కనుగొన్నాడు. ఆ మిర్రర్ స్థానంలో ఇంట్లో ఉపయోగించే చిన్న ప్లాస్టిక్ అద్దాన్ని బిగించాడు. ఆ కారు యజమాని సృజనాత్మక దృష్టి చాలా మందిని ఆకట్టుకుంటోంది.


వైరల్ అవుతున్న ఈ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. 2.7 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``నేను చూసిన బెస్ట్ జుగాడ్ ఇదే``, ``ఆ వ్యక్తికి సైడ్ మిర్రర్ ప్రాముఖ్యం తెలిసినందుకు చాలా సంతోషంగా ఉంది``, ``చాలా మంచి ఆలోచన`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: వీడియో చూస్తే ఒళ్లు గగుర్పొడవాల్సిందే.. గాల్లో ఎగురుతూ ఢీకొన్న రెండు హెలికాఫ్టర్లు.. 10 మంది మృతి!


Puzzle: తెలివైన వాళ్లు కూడా ఈ ఫొటోలోని తప్పును కనిపెట్టలేకపోయారు.. మీరు కనిపెట్టగలరేమో ప్రయత్నించండి..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 23 , 2024 | 03:56 PM