Share News

Minister Sridhar Babu: మార్పుకు అడ్డొస్తే సహించం

ABN , Publish Date - May 26 , 2024 | 05:25 PM

బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు కలిసినా సీట్లు రావట్లేదనే అక్కసుతో అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) అన్నారు. ప్రతిపక్షాల విమర్శలకు ప్రభుత్వ పనితీరే సమాధానం చెబుతోందన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో కంటే తమ ప్రభుత్వం అభివృద్ధిలో మార్పు తెస్తుందని... మార్పుకు అడ్డు వస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు.

Minister Sridhar Babu: మార్పుకు అడ్డొస్తే సహించం
Minister Sridhar Babu

హైదరాబాద్: బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు కలిసినా సీట్లు రావట్లేదనే అక్కసుతో అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) అన్నారు. ప్రతిపక్షాల విమర్శలకు ప్రభుత్వ పనితీరే సమాధానం చెబుతోందన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో కంటే తమ ప్రభుత్వం అభివృద్ధిలో మార్పు తెస్తుందని... మార్పుకు అడ్డు వస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం గాంధీభవన్‌లో మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. అబద్దాలను ప్రచారం చేస్తే బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు అవుతుందని చెప్పారు.


వారిలో కూడా మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వ పొరపాట్లను తాము ఏం చేయమన్నారు.గత ప్రభుత్వాన్ని సలహాలు, సూచనలు ఇవ్వమని చాలాసార్లు కోరామని.. వారు ఎలాంటి సలహాలు ఇవ్వలేదని చెప్పారు. తమ ప్రభుత్వం అత్యంత ప్రజాస్వామికంగా ఉందన్నారు. ప్రజలకు ఇస్తున్న పథకాలను కేసీఆర్, కేటీఆర్, హరీష్ పక్కతోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.


గత కేసీఆర్ ప్రభుత్వంలో... ఎంజీఎం హాస్పిటల్లో గత ఏడాది121 సార్లు కరెంట్ బ్రేక్ డౌన్ అయిందన్నారు.ఎంజీఎం హస్పిటల్లో ఎలుకలు పేషంట్ చర్మాన్ని తిన్నాయని గుర్తుచేశారు. గత ప్రభుత్వం సివిల్ సప్లయ్ శాఖలో అడ్డగోలుగా అప్పులు చేశారని మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

TG Politics: పరిటాల రవి హత్య జరిగినప్పుడు ప్రవీణ్ కుమార్ మీద చర్యలు తీసుకున్నారా.. మల్లు రవి సూటి ప్రశ్నలు

Minister Tummala: నా లక్ష్యం అదే.. మంత్రి తుమ్మల ఆసక్తికర వ్యాఖ్యలు

TG Politics: బీఆర్ఎస్ నేతలు భారీగా డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేశారు.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు

TG Politics: మహేశ్వర రెడ్డిని మేమే పెంచి పోషించాం: మంత్రి ఉత్తమ్

Read Latest Telangana News and Telugu News

Read Latest AP News and Telugu News

Updated Date - May 26 , 2024 | 09:53 PM