MLA Rajagopal Reddy:బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదంతో రోడ్డుపైకి నిర్వాసితులు
ABN , Publish Date - Jun 28 , 2024 | 05:14 PM
జిల్లాలోని మర్రిగూడెం మండలం చర్లగూడెం ప్రాజెక్ట్ భూనిర్వాసితులకు తాను అండగా ఉంటానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (MLA Rajagopal Reddy) హామీ ఇచ్చారు. ప్రాజెక్ట్ వద్ద భూ నిర్వాసితులతో మాట్లాడారు.
నల్గొండ : జిల్లాలోని మర్రిగూడెం మండలం చర్లగూడెం ప్రాజెక్ట్ భూ నిర్వాసితులకు తాను అండగా ఉంటానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (MLA Rajagopal Reddy) హామీ ఇచ్చారు. ప్రాజెక్ట్‌ను ఈరోజు (శుక్రవారం) ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ప్రాజెక్ట్ ప్రారంభించి పదేళ్లు పూర్తి పూర్తయ్యిందని చెప్పారు. నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో తెలియకుండానే మాజీ సీఎం కేసీఆర్ ప్రాజెక్టు మొదలుపెట్టారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ తొందరపాటు చర్యలతో నిర్వాసితులు రోడ్డున పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్ వర్షం నీటితో నిండేది కాదని.. ఒకవేళ పూర్తయినా నీళ్లు రావని చెప్పారు.
ఇప్పటికే ప్రభుత్వం రూ.6వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. కట్ట పనులు ఆపాలంటూ నిర్వాసితులు అడ్డుకుంటున్నారని చెప్పారు. కట్ట పూర్తి చేయడం వల్ల గ్రామానికి నష్టం వాటిళ్లదని తెలిపారు. ఆర్ ఎండ్ ఆర్ ప్యాకేజీ రాని వారికి ఇప్పించే బాధ్యత తనదని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఒప్పించి ఇబ్రహీంపట్నంలో ఇంటి స్థలాలు ఇప్పించడానికి ప్రయత్నం చేస్తానని, కుదరకపోతే చింతపల్లిలో ఇప్పిస్తానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు.