Share News

CM Chandrababu: తిరుపతి నాగాలమ్మ ఆలయంలో సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు

ABN , Publish Date - Jan 14 , 2025 | 01:41 PM

CM Chandrababu: మకర సంక్రాంతి.. ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని సీఎం చంద్రబాబు అన్నారు. మన పల్లెలు.. పాడిపంటలతో మరింత కళకళలాడాలని సీఎం చంద్రబాబు కోరుకున్నారు. ఎంత ఎదిగినా మన మూలాలు, సంప్రదాయాలు మరిచిపోకూడదని సీఎం చంద్రబాబు అన్నారు.

CM Chandrababu: తిరుపతి నాగాలమ్మ ఆలయంలో సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు
CM Chandrababu

తిరుపతి: నాగాలమ్మ ఆలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. నాగాలమ్మ పూజల్లో ఇవాళ(మంగళవారం) నారా వంశీకులు పాల్గొన్నారు. నాగాలమ‌్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయలు కొట్టి నారా చంద్రబాబు నాయుడు,లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మిని, దేవాన్ష్, ఎంపీ భరత్ ఆయన సతీమణి తేజస్విని, తదితరులు మొక్కులు చెల్లించుకున్నారు. నాగాలమ‌్మ వద్ద పూజల అనంతరం తీర్థప్రసాదాలను కుల పెద్దలు అందజేశారు. నాగాలమ్మ పుట‌్టకు నూలుపోగులు చుట్టి , పాలను నైవేద్యంగా నారా భువనేశ్వరి, బ్రాహ్మిని తదితరులు సమర్పించారు. మహిళలు పూజల్లో ఉండగా నాగ దేవతల సమీపంలోనే మనవళ్లతో చంద్రబాబు గడుపుతున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు సీఎం చంద్రబాబు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మకర సంక్రాంతి.. ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని చంద్రబాబు అన్నారు. మన పల్లెలు.. పాడిపంటలతో మరింత కళకళలాడాలని సీఎం చంద్రబాబు కోరుకున్నారు. ఎంత ఎదిగినా మన మూలాలు, సంప్రదాయాలు మరిచిపోకూడదని సీఎం చంద్రబాబు అన్నారు.


ఊరి పెద్దలతో ముచ్చటించారు. నాగ దేవతల ప్రసాదాలను నారా, నందమూరి కుటుంబాలు స్వీకరించాయి. నారా చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులు ఖర్జూర నాయుడు - అమ్మనమ్మ సమాధులు వద్దకు చేరుకుని చంద్రబాబు కుటుంబ సభ్యులు నివాళి అర్పించారు. అనంతరం నారావారిపల్లిలోని ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు.

Updated Date - Jan 14 , 2025 | 01:43 PM