CM Chandrababu: కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. ఎందుకంటే
ABN , Publish Date - Feb 20 , 2025 | 02:54 PM
CM Chandrababu: ఏపీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టారు. సీఎం చంద్రబాబు ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. ఢిల్లీలో పర్యటిస్తున్న చంద్రబాబు పలువురు నేతలను కలుస్తున్నారు. ఏపీ డెవలప్‌మెంట్‌పై సీఎం చంద్రబాబు చర్చిస్తున్నారు.

అమరావతి: కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో (CR Patil) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఇవాళ(గురువారం) సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఏపీకి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. సీఆర్ పాటిల్‌తో ఫలవంతమైన సమావేశం జరిగిందని అన్నారు. పోలవరం ఎడమ, కుడి కాలువల నిర్మాణానికి చేసిన ఖర్చును రీయింబర్స్ చేయాలని సీఎం చంద్రబాబు కోరారు.
ALSO READ: GV Reddy: వారితో కుట్ర చేస్తున్నారా.. ఏపీ ఫైబర్ నెట్ ఎండీపై జీవీరెడ్డి ఫైర్
పోలవరం ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడానికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సీఎం చంద్రబాబు కోరారు. పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌కు వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 200 టీఎంటీల వరద నీరు గోదావరిలోని పోలవరం నుంచి బనకచర్లకు పంపేందుకు లింక్ కెనాల్ ఏర్పాటుపై చర్చించామని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ఏపీ కరువు రహితంగా మారడంతో పాటు 80 లక్షల మందికి తాగునీరు అందిస్తుందని వివరించారు. 3 లక్షల హెక్టార్ల నూతన ఆయకట్టు ఏర్పాడుతుందని అన్నారు. 9.14 లక్షల హెక్టార్లకు ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందన్నారు. 20 టీఎంసీలు నీరు పరిశ్రమలకు అందించగలుగుతామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూాడా చదవండి
Vamshi Case: వంశీ కస్టడీ పిటిషన్‌పై ముగిసిన వాదనలు.. కోర్టు ఏం చెప్పిందంటే
GV Reddy: వారితో కుట్ర చేస్తున్నారా.. ఏపీ ఫైబర్ నెట్ ఎండీపై జీవీరెడ్డి ఫైర్
Read Latest AP News And Telugu News