Botsa Satyanarayana: జగన్‌కు ఆ విషయం తెలియదు.. బొత్స సత్యనారాయణ షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Feb 21 , 2025 | 07:18 PM
Botsa Satyanarayana: కూటమి ప్రభుత్వంలో రైతులకు ప్రాధాన్యం లేదా అని మాజీ మంత్రి, వైసీపీ అగ్రనేత బొత్స సత్యనారాయణ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ ప్రభుత్వానికి రైతులు, వ్యవసాయం పట్ల చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు.

విశాఖపట్నం: ఏపీలో కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి, వైసీపీ అగ్రనేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. జగన్ నేరుగా వెళ్లి మిర్చి రైతులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్నారని తెలిపారు. ఆ పర్యటన తర్వాతే మిర్చి రైతులు సమస్య ప్రభుత్వానికి తెలిసిందని అన్నారు. ఢిల్లీలో సంబంధిత మంత్రి లేకపోయినా మిర్చి రైతుల సమస్యలు కోసం మాట్లాడటానికి వెళ్తున్నామని సీఎం చంద్రబాబు ఎలా చెబుతారని ప్రశ్నించారు. జగన్ వెళ్తే కానీ మిర్చి రైతులు ఇబ్బందులు ప్రభుత్వానికి తెలియలేదా అని నిలదీశారు. ఈ ప్రభుత్వానికి రైతులు, వ్యవసాయం పట్ల చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. మిర్చి రైతుల సమస్యలు తెలుసుకోవడానికి జగన్ వెళ్తే ఈల్లీగల్ యాక్టివిటీ ఎలా అవుతుందని ప్రశ్నించారు.
మరి మ్యూజికల్ నైట్‌కు వెళ్లడం ఏ ఆక్టివిటీ అవుతుందని నిలదీశారు. కూటమి ప్రభుత్వంలో రైతులకు ప్రాధాన్యం లేదా అని ప్రశ్నల వర్షం కురిపించారు. భూ కుంభకోణాలపై వేసిన సిటీ నివేదికను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఆది ఏ ప్రభుత్వ హయాంలో జరిగిన నివేదిక బయటపెట్టాలన్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యక్తిగత అజెండాతో మాట్లాడుతున్నారని విమర్శించారు. వ్యక్తిగత ఎజెండాలకు రాజకీయాల్లో తావు లేదని చెప్పారు. జగన్మోహన్ రెడ్డికి మిర్చి యార్డ్‌కు వెళ్లవద్దని ఎన్నికల కమిషన్ ఏం చెప్పలేదని అన్నారు. కోడి కత్తి కేసులో జగన్మోహన్ రెడ్డి హాజరకాకపోతే కోర్టు నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. గ్రూప్ 2లో రోస్టర్ విధానంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. అభ్యర్థులకు ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సూపర్ సిక్స్ హామీలు పూర్తిగా అమలు చేయడంలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు వైసీపీ దూరంగా ఉందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Minister Kollu Ravindra: జగన్ డ్రామాలను ప్రజలు ఛీకొడుతున్నారు.. మంత్రి కొల్లు రవీంద్ర విసుర్లు
Viveka Case: వివేకా హత్య కేసులో పీఏ కృష్ణారెడ్డికి ఎదురుదెబ్బ
Vamshi Case: మళ్లీ సమయం కోరిన పోలీసులు.. వంశీ న్యాయవాదుల అభ్యంతరం
Read Latest AP News And Telugu News