YSRCP Scams: సంచలనం సృష్టిస్తున్న వైసీపీ కొత్త స్కాం
ABN , Publish Date - Feb 09 , 2025 | 08:27 AM
Kakani Govardhan Reddy land scam: మాజీ మంత్రి కాకణి గోవర్థన్ రెడ్డి భారీ స్థాయిలో భూ ఆక్రమణలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై కూటమి ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించాలని బాధితులు కోరుతున్నారు.

నెల్లూరు: వైసీపీ హయాంలో భారీ కుంభకోణం బయటపడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత జగన్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపై ఫోకస్ పెట్టింది. బాధితులు కూడా పెద్దఎత్తున ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి భారీ భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కాకాణి అక్రమ భాగోతాలు బయటకు వస్తున్నాయి. రూ.230కోట్ల విలువ చేసే పేదల భూములను తన అల్లుడు కంపెనీకి అప్పనంగ దోచిపెట్టినట్లు కాకాణిపై ఆరోపణలు వచ్చాయి. రామదాసుకండ్రిగ ప్రాంతంలో పోర్టు రోడ్డుకు ఆనుకుని ఉన్న భూములను కాజేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
అల్లుడి డొల్లకంపెనీకి భూములు..
రైతులను బెదిరించి, భయపెట్టి ఎకరా భూమి రూ.15,62,142లు చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల నోటిఫికేషన్‌కు ఒక్కరోజు ముందు కాకణి అల్లుడి డొల్లకంపెనీకి భూములను గత జగన్ ప్రభుత్వం అప్పగించింది. 2024 మార్చి నెల 16న ఎన్నికల నోటిఫికేషన్‌ను సీఈసీ ఇచ్చిన విషయం తెలిసిందే. మార్చి నెల 15న భూములు అప్పగిస్తూ ప్రొవిజనల్ అలాట్మెంట్‌ను ఏపీఐఐసీ ఆర్డర్ మంజూరు చేసింది. భూముల అప్పగింతకు కాకాణి, వైసీపీ పెద్దలు, ఏపీఐఐసీ ఉన్నతాధికారులు చక్రం తిప్పారు. భూముల కోసం జీకేఎస్ ఇండస్ట్రీయల్ అండ్ సప్లై చైన్ మేనేజ్‌మెంట్ ప్రైవేటు లిమిటెడ్ పేరిట డొల్ల కంపెనీ ఏర్పాటు చేసింది. ఆ డొల్ల కంపెనీలో రాత్రికి రాత్రే కాకాణి అల్లుడు మన్నెం గోపాలకృష్ణారెడ్డికి సీఈఓ పదవి అప్పగించారు. కాకాణి భూ కుంభకోణాలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ విషయంపై విచారణ జరిపించి, న్యాయం చేయాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భార్యను చంపింది గురుమూర్తి ఒక్కడే కాదు
జీతం అడిగితే.. విషం తాగి చావమన్నారు!
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News