Cyber Crime : తస్మాత్ జాగ్రత్త.. ట్రెండ్ మార్చిన సైబర్ నేరగాళ్లు
ABN , Publish Date - Jan 28 , 2025 | 03:53 PM
Cyber Crime: టెక్నాలజీ పెరుతున్న తరుణంలో కొత్త తరహా మోసాలు వెలుగుచూస్తున్నాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోదగ్గది సైబర్ ఫ్రాడ్. ఇటీవల కాలంలో ఇలాంటి మోసాలు చాలా ఎక్కువైపోయాయి. బాధితులు మోసం చేయడానికి సైబర్ మోసగాళ్లు పలు రకాల టెక్నిక్‌లతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు.

విజయనగరం: ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త తరహా మోసంతో అమాయకులను మోసం చేస్తున్నారు. ఈజీగా మనీ సంపాదించాలనే కోరిక ఉన్న వారే లక్ష్యంగా సైబర్ క్రిమినల్స్(Cyber criminals) రెచ్చిపోతున్నారు. ఈ తరహాలోనే సరికొత్త పంథాలను ఎంచుకుంటున్నారు. తాజాగా మరో కొత్త మోసానికి కేటుగాళ్లు తెగబడ్డారు. డిజిటల్ అరెస్టు పేరిట సైబర్ క్రిమినల్స్ బాధితులను బయపెట్టి భారీ మొత్తంలో కాజేస్తు.. అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. ఈ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు అలర్ట్ చేస్తున్నాయి. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రజలకు సూచించారు. సైబర్ క్రిమినల్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఏపీ డీజీపీ తెలిపారు. సైబర్ నేరాలకు పాల్పడుతున్న కేటుగాళ్లకు డీజీపీ ద్వారకా తిరుమలరావు వార్నింగ్ ఇచ్చారు.
డిజిటల్ అరెస్టు ద్వారా ఫోన్ , వీడియో కాల్స్ ద్వారా భయబ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. డిజిటల్ అరెస్టు అనేది అసలు లేదని స్పష్టం చేశారు. పీడీ యాక్ట్ పెట్టీ కేసులు పెట్టడం ద్వారా ప్రజల్లో పోలీసులకు ఒక మంచి భావన ఏర్పడిందని చెప్పారు. ఫింగర్ ప్రింట్ సిస్టమ్‌లో ఆంధ్రప్రదేశ్ వెనుక బడి ఉందని... తాను డీజీపీగా వచ్చిన తర్వాత ఆ వ్యవస్థను మెరుగుపరిచానని అన్నారు. విజయనగరం జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని డీజీపీ ద్వారకా తిరుమలరావు ఇవాళ(మంగళవారం) సందర్శించారు. ఈ సందర్భంగా డీజీపీ మీడియాతో మాట్లాడుతూ... ఉత్తరాంధ్రలో గంజాయి నిర్మూలన, డ్రగ్ కంట్రోల్ చేయడమే ప్రధాన లక్ష్యమని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. చాలా మందికి తమ డిపార్ట్‌మెంట్‌లో ప్రమోషన్స్, అలవెన్స్ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్న విషయం వాస్తవమని తెలిపారు. ఏపీ ప్రభుత్వం దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లానని... వెంటనే పోలీస్ వెల్ఫేర్ కోసం రూ.4 కోట్ల 70 లక్షలను మంజూరు చేశారని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు.
అనకాపల్లి జిల్లాలో గంజాయి ధ్వంసం..
అనకాపల్లి జిల్లాలో వివిధ కేసుల్లో పట్టుబడిన గంజాయిని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు ధ్వంసం చేశారు. జిల్లాలో 2022 నుంచి ఇప్పటి వరకు 34,419 వేల కేజీల గంజాయి, 39 కేజీలా లిక్విడ్ గంజాయి పట్టుబడింది. ఈ గంజాయి విలువ రూ. 17 కోట్ల 60 లక్షలు. మొత్తం కేసుల సంఖ్య 459, అరెస్ట్ అయినా వ్యక్తులు 1,304, మొత్తం వాహనాలు 205 స్వాధీనం చేసుకున్నారు. పరవాడ ఫార్మసిటీలోని కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్‌లో భారీగా గంజాయి ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో డీజీపీ ద్వారకా తిరుమలరావు, ఈగల్ టాస్క్‌ఫోర్స్ ఐజీ ఆకే రవి కృష్ణ.. విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జట్టి, అనకాపల్లి తుహిన్ సిన్హా పాల్గొన్నారు.
తిరుపతిలో భారీ మోసం.. వెలుగులోకి ఇలా..
తిరుపతి: డిజిటల్ అరెస్టు ముసుగులో అమాయకులను మోసం చేస్తూ కోట్లు దోచుకుంటున్న వైజాగ్ ముఠా గుట్టు రట్టు చేశారు తిరుపతి జిల్లా పోలీసులు. ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల దగ్గరి నుంచి రూ. 32.5 లక్షల నగదు, 141 గ్రాముల బంగారం, సిమ్ మ్యాడ్యుల్స్, 8 రూటర్లు, రూ. 10 లక్షలు సీజ్ చేశారు. ఈ మేరకు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియాకు వివరాలు వెల్లడించారు. తిరుపతిలోని సీనియర్ సిటిజన్ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ కేసు నమోదు చేశామని తెలిపారు. వైజాగ్ కేంద్రంగా కొంతమంది సైబర్ నేరగాళ్లు ఫోన్ల ద్వారా మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని అన్నారు.
నిందితులపై నిఘా ఉంచి కేసు దర్యాప్తు ప్రారంభించామన్నారు. విచారణలో దాదాపు రూ.2.5 కోట్ల సైబర్ క్రైమ్ జరిగినట్లు గుర్తించామని చెప్పారు. తమ విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. తిరుపతిలోని ఓ మహిళకు వాట్సాప్ కాల్ చేసి ఢిల్లీ సీబీఐ అధికారులమంటూ రూ.200 కోట్ల మనీ లాండరింగ్ జరిగినట్లు బాధితురాలని భయపెట్టారని చెప్పారు. సదరు మహిళ పైన ఉన్న బ్యాంక్ అకౌంట్‌ను చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించినట్లు సైబర్ కేటుగాళ్లు మహిళకు చెప్పడంతో భయపడిందన్నారు. భయపడిన మహిళ నుంచి రూ. 2.5 కోట్లు నిందితులు కాజేశారు. డబ్బులు తీసుకెళ్లాక ఫోన్ కాల్ రాకపోవడంతో మహిళకు అనుమానం వచ్చిందన్నారు. తిరుపతి పోలీసులను బాధితురాలు ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారని చెప్పారు.. మహిళ ఇచ్చిన వివరాల ప్రకారం దర్యాప్తు జరిపామని తెలిపారు. విచారణలో విశాఖపట్నానికి చెందిన ఏడు మంది నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. నిందితుల దగ్గరి నుంచి ఒక కారు, రూ.10 లక్షల విలువ చేసే బంగారం, రూ.32.5 లక్షల నగదు, ఒక సిమ్ మాడ్యులర్, 8 రూటర్లను స్వాధీనం చేసుకున్నామని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
YS Sharmila: అప్పుడు కనబడలేదా ఆర్థిక భారం.. షర్మిల ఫైర్
Tirumala: తిరుమలకు ఇస్రో ఛైర్మన్.. గగన్‌యాన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు..
Nara Lokesh: ఉద్యోగుల కాళ్ల దగ్గర మంత్రి నేమ్ ప్లేట్
Read Latest AP News And Telugu News