Share News

Viral Video: సీటు లేదని చింతించలేదు.. రైల్లో ఈ బాబా ఎలా పడుకున్నాడో చూస్తే..

ABN , Publish Date - Feb 24 , 2025 | 10:24 AM

కాషాయ వస్త్రాలు ధరించిన ఓ బాబా.. రద్దీగా ఉన్న రైలు ఎక్కుతాడు. లోపల కాలు తీసి కాలు పెట్టడానికి కూడా స్థలం ఉండదు. అయినా ఆ బాబా ఏమాత్రం చితించలేదు. చివరకు విచిత్రంగా ప్రవర్తించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.

Viral Video: సీటు లేదని చింతించలేదు.. రైల్లో ఈ బాబా ఎలా పడుకున్నాడో చూస్తే..

రైళ్లలో సీటు కోసం కొందరు చిత్రవిచిత్ర విన్యాసాలు చేయడం చూస్తుంటాం. కొందరు సీటు లేకున్నా కుర్చీని వెంట తెచ్చుకుంటుంటారు. మరికొందరు సీటుపైన తాడుతో ఊయల తరహాలో కట్టి మరీ నిద్రపోతుంటారు. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. రద్దీగా ఉన్న రైలు ఎక్కిన ఓ బాబా.. అందులో సీటు లేకపోయినా విచిత్రంగా పడుకోవడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కాషాయ వస్త్రాలు ధరించిన ఓ బాబా.. రద్దీగా ఉన్న రైలు ఎక్కుతాడు. లోపల కాలు తీసి కాలు పెట్టడానికి కూడా స్థలం ఉండదు. అయినా ఆ బాబా ఏమాత్రం చితించలేదు. చివరకు విచిత్రంగా ప్రవర్తించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.

Viral Video: ఇతడి తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. సింపుల్ టెక్నిక్‌తో బట్టలు ఎలా ఉతుకుతున్నాడో చూడండి..


లగేజీ ర్యాక్‌ను పట్టుకుని వేలాడిన ఆ బాబా.. (Baba hanging from luggage rack) తన కాళ్లను పైకి పెట్టి, చేతులతో పట్టుకుని గాల్లో వేలాడుతూ ఉన్నాడు. ఇలా చాలా సేపు అతను అలాగే పట్టుకుని ఉన్నాడు. పైగా ఎంతో తాపీగా కళ్లు మూసుకుని నిద్రపోతున్నట్లు కనిపించాడు. ఈ క్రమంలో ఏమాత్రం చేతులు జారినా ధబేల్‌మని కింద ఉన్న ప్రయాణికులపై పడిపోయే ప్రమాదం ఉంది. కానీ ఈ బాబా మాత్రం ఎంతో ఓపిగ్గా అలాగే వేలాడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.

Viral Video: ఈ పామేంటీ ఇలా మారిపోయింది.. ఫోన్ చూడగానే దగ్గరికి వెళ్లి మరీ..


ఈ ఘటనను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘స్పైడర్ మ్యాన్ కూడా అవాక్కయ్యేలా చేస్తున్నాడుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి వృద్ధులకు సీటు ఇచ్చి గౌరవించాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.36 లక్షలకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వామ్మో.. వీళ్లేంట్రా బాబోయ్.. కొండచిలువను ముక్కలుగా కోసి.. కేకుల్లా..


ఇవి కూడా చదవండి..

Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..

Viral Video: ఈ కారును ఫోలో చేస్తే గజగజా వణికిపోవాల్సిందే.. సమీపానికి వెళ్లి చూస్తే గుండె ఆగిపోయే సీన్..

Viral Video: పిల్లలకు ఫోన్లు అలవాటు చేస్తున్నారా.. ఈ చిన్నారి పరిస్థితి ఏమైందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 24 , 2025 | 10:24 AM