Viral Video: ఇతడి తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. సింపుల్ టెక్నిక్‌తో బట్టలు ఎలా ఉతుకుతున్నాడో చూడండి..
ABN , Publish Date - Feb 24 , 2025 | 09:46 AM
అంతా కష్టపడి చేసే పనులను కొందరు ఎంతో సింపుల్‌గా చేసేస్తుంటారు. మరికొందరు స్మార్ట్ వర్క్ చేస్తూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. ఇంకొందరు చిత్ర విచిత్ర ప్రయోగాలు చేస్తూ ఎలాంటి పనులనైనా చిటికెలో చేసేస్తుంటారు. కొందరు సైకిల్ చక్రం సాయంతో బట్టలు ఉతకడం చూస్తుంటాం. మరికొందరు..

అంతా కష్టపడి చేసే పనులను కొందరు ఎంతో సింపుల్‌గా చేసేస్తుంటారు. మరికొందరు స్మార్ట్ వర్క్ చేస్తూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. ఇంకొందరు చిత్ర విచిత్ర ప్రయోగాలు చేస్తూ ఎలాంటి పనులనైనా చిటికెలో చేసేస్తుంటారు. కొందరు సైకిల్ చక్రం సాయంతో బట్టలు ఉతకడం చూస్తుంటాం. మరికొందరు ఏకంగా ఇటుకలతో వాషింగ్ మెషిన్ నిర్మించి అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇలాంటి చిత్రవిచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే, తాజాగా ఓ వ్యక్తి బట్టలను ఎంతో విచిత్రంగా ఉతికేసి అందరినీ షాక్‌కు గురి చేస్తున్నాడు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి బట్టలను విచిత్రంగా ఉతుకుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ఇందుకోసం అతను స్టాండింగ్ ఫ్యాన్ తరహాలో పొడవాటి ఇనుప రాడ్‌కు ముందు గుండ్రంగా తిరిగేలా వీల్ ఏర్పాటు చేశాడు. అలాగే దానికి ప్లాస్టిక్ బకెట్ కట్టేశాడు. చివరగా దాన్ని పట్టుకునేందుకు వీలుగా మొదట్లో సైకిల్ హ్యాండిల్ ఫిట్ చేశాడు.
Pakistan Viral Video: పాకిస్థాన్‌లో స్కానింగ్ ఎలా చేస్తారో తెలుసా.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
ఇలా మొత్తం సిద్ధం చేశాక.. బకెట్‌లో బట్టలు వేసి, దాన్ని నీళ్లలో ముంచి ఆన్ చేశాడు. దీంతో ఆ బకెట్ వేగంగా గిరగిరా తిరుగుతూ (Washing clothes) దస్తులను శుభ్రం చేసింది. ఆ తర్వాత బయటికి తీసి.. మళ్లీ ఆన్ చేయగా బకెట్ గిరగిరా తిరగడం వల్ల తడిసిన బట్టలు కాస్తా ఆరిపోయాయి. ఇలా ఉతకడం, ఆరబెట్టడం అన్నీ చిటికెలో చేసేశాడు.
Viral Video: వామ్మో.. వీళ్లేంట్రా బాబోయ్.. కొండచిలువను ముక్కలుగా కోసి.. కేకుల్లా..
కాగా, ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వాషింగ్ మెషిన్ అవుడ్ సైడ్ వ్యూలా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘ఈ ఐడియా ఏదో చాలా బాగుందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2500కి పైగా లైక్‌లు, లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: ఈ పామేంటీ ఇలా మారిపోయింది.. ఫోన్ చూడగానే దగ్గరికి వెళ్లి మరీ..
ఇవి కూడా చదవండి..
Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..