Snake Viral Video: ఫోన్‌లో మాట్లాడుతున్న వ్యక్తి.. వెనుక నుంచి దాడి చేసిన పాము.. చివరకు తలపై చూడగా..
ABN , Publish Date - Feb 23 , 2025 | 10:28 AM
ఓ యువకుడు కర్రలతో చేసిన సోఫాపై కూర్చుని ఫోన్ మాట్లాడుతుంటాడు. అదే సమయంలో అతడి వెనుక వైపు కర్రలపై నల్లటి కట్ల పాము ఉంటుంది. కిందకు వెళ్లే క్రమంలో ఆ పాము అతడి తలపై కాటేసేందుకు ప్రయత్నిస్తుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

కొన్నిసార్లు అదృష్టం బాగుంటే.. ఎన్ని ప్రమాదాలు ఎదురైనా చిన్న గాయం కూడా కాకుండా బయటపడుతుంటారు. మరికొన్నిసార్లు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా లేనిపోని సమస్యలు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు కొందరు చావు అంచుల దాకా వెళ్లి క్షేమంగా బయటపడడం కూడా చూస్తుంటాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఓ పాము దాడి వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ఫోన్ మాట్లాడుతుండగా వెనుక వైను నుంచి పాము దాడి చేసింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు కర్రలతో చేసిన సోఫాపై కూర్చుని ఫోన్ మాట్లాడుతుంటాడు. అదే సమయంలో అతడి వెనుక వైపు కర్రలపై నల్లటి కట్ల పాము ఉంటుంది. కిందకు వెళ్లే క్రమంలో (Snake tried to bite Young man) ఆ పాము అతడి తలపై కాటేసేందుకు ప్రయత్నిస్తుంది. నేరుగా అతడి తలపై కొరికే ప్రయత్నం చేస్తుంది.
Marriage Funny Video: ఉంగరం తీస్తున్నారా.. యుద్ధం చేస్తున్నారా.. ఈ వధూవరులు ఏం చేస్తున్నారో చూడండి..
అయితే అదృష్టవశాత్తు అతడు టోపీ ధరించి ఉండడంతో ఏమీ కాదు. టోపీని కొరికిన పాము.. (snake bit the hat) చివరకు దాన్ని పక్కకు లాగేస్తుంది. దీంతో అతడు సడన్‌గా వెనక్కు తిరిగి చూస్తాడు. తనపై పాము కాటేయడాన్ని చూసి ఆ వ్యక్తి ఒక్కసారిగా షాక్ అవుతాడు. వెంటనే పైకి లేచి అక్కడి నుంచి దూరంగా పారిపోతాడు. ఇలా టోపీ కారణంగా పాము కాటు నుంచి తప్పించుకున్న ఈ వ్యక్తిని చూసి అంతా అవాక్కవుతున్నారు.
Dog Viral Video: వావ్..! ఇది కదా క్యాచ్ అంటే.. పడిపోతున్న కుక్కను ఎలా కాపాడిందో చూస్తే..
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు’’.. అంటూ కొందరు, ‘‘ప్రాణాలు కాపాడిన టోపీ’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 10 వేలకు పైగా లైక్‌లు, 7 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: ఏనుగుల పంట పండిందిగా.. రోడ్డుపై నారింజ పండ్ల ట్రక్కు ఆగిపోవడంతో.. చివరకు..
ఇవి కూడా చదవండి..
Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..