Viral Video: ఈ పామేంటీ ఇలా మారిపోయింది.. ఫోన్ చూడగానే దగ్గరికి వెళ్లి మరీ..
ABN , Publish Date - Feb 24 , 2025 | 08:41 AM
ఓ పాము ఫోన్ చూడగానే విచిత్ర ప్రవర్తించడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఓ వ్యక్తి పాముకు ఎదురుగా దూరంగా నేలపై స్మార్ట్ ఫోన్ పెట్టి, వీడియో ప్లే చేశాడు. అటుగా వెళ్లిన పాము.. స్మార్ట్ ఫోన్‌ను సమీపానికి వెళ్లి ఆగిపోయింది. తర్వాత ఏం జరిగిందో చూడండి..

పాములు కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తుంటాం. నాన్‌వెజ్‌కు బదులుగా టమాటాలను తినడం.. మంచంపై దుప్పట్లో దూరి పడుకోవడం.. ఫ్రిడ్జ్‌లు, సీలింగ్ ఫ్యాన్‌లపై వేలాడుతూ అందరినీ షాక్‌కు గురి చేస్తుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఫోన్‌ను చూసిన ఓ పాము.. దగ్గరికి వెళ్లి విచిత్రంగా ప్రవర్తించింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ‘‘ఈ ఫోన్ పామును కూడా మార్చేసిందిగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పాము ఫోన్ చూడగానే విచిత్ర ప్రవర్తించడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఓ వ్యక్తి పాముకు ఎదురుగా దూరంగా నేలపై స్మార్ట్ ఫోన్ పెట్టి, వీడియో ప్లే చేశాడు. అటుగా వెళ్లిన పాము.. స్మార్ట్ ఫోన్‌ను సమీపానికి వెళ్లి ఆగిపోయింది.
Pakistan Viral Video: పాకిస్థాన్‌లో స్కానింగ్ ఎలా చేస్తారో తెలుసా.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
ఫోన్‌ను చూడగానే ఆగిపోవడమే కాదు.. వీడియోలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లుగా ప్రవర్తించింది. ఎటూ కదలకుండా చాలా సేపు (snake looking at smart phone) ఫోన్ వైపే చూస్తూ ఉండిపోయింది. మధ్య మధ్యలో తలను అటూ, ఇటూ ఊపుతూ ఉంది. ఇది చూసే వారికి పాము వీడియో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోందన్నమాట.
Viral Video: బైకు నడిపేటప్పుడు జాగ్రత్తగా లేకపోతే అంతే.. ఇతడికేమైందో చూడండి..
ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈ పామేంటీ.. మరీ విచిత్రంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘పామును కూడా చెడగొట్టిన ఫోన్’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8.4 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: వామ్మో.. వీళ్లేంట్రా బాబోయ్.. కొండచిలువను ముక్కలుగా కోసి.. కేకుల్లా..
ఇవి కూడా చదవండి..
Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..