Viral Video: బైకు నడిపేటప్పుడు జాగ్రత్తగా లేకపోతే అంతే.. ఇతడికేమైందో చూడండి..
ABN , Publish Date - Feb 23 , 2025 | 01:28 PM
రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన అనేక వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. కొన్నిసార్లు కొందరు నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతుంటారు. మరికొన్నిసార్లు రోడ్ల కారణంగా చాలా మంది గాయాలపాలతుంటారు. ఇలాంటి..

రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన అనేక వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. కొన్నిసార్లు కొందరు నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతుంటారు. మరికొన్నిసార్లు రోడ్ల కారణంగా చాలా మంది గాయాలపాలతుంటారు. ఇలాంటి సమయాల్లో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఏకంగా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఓ బైకర్ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. బైకు నడుపుతున్న ఓ వ్యక్తి ప్రమాదానికి గురైన తీరు చూసి అంతా అవాక్కవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. గుజరాత్‌లోని (Gujarat) వడోదరలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న రోడ్డు మధ్యలో కొందరు పెద్ద గుంత తవ్వారు. కానీ దాన్ని పూడ్చేయకుండా, దాని చుట్టూ మొక్కబడిగా కొన్ని కర్రలు పాతి అలాగే వదిలేశారు. ఇదిలావుండగా, ఇటీవల రాత్రి సమయంలో కొందరు వాహనదారులు అటుగా వెళ్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
Viral Video: గుండెపోటుతో చనిపోయాడని అంతా అనుకున్నారు.. చివరకు పెళ్లి వీడియోలో చూడగా షాకింగ్ సీన్..
అటుగా వచ్చిన ఓ బైకర్ అదుపు తప్పి ధబేల్‌మని మధ్యలో ఉన్న గుంతలో (Biker fell into open pit) పడిపోయాడు. లోతుంగా ఉండడంతో బయటికి రాలేక గట్టిగా కేకలు వేశాడు. చుట్టు పక్కల వారు గమనించి అక్కడికి పరుగెత్తుకుంటూ వెళ్లారు. చివరకు అతన్ని అతి కష్టం మీద బయటికి తీశారు. ఈ ఘటనలో ఆ వ్యక్తి స్వల్పంగా గాయపడ్డట్లు తెలిసింది. ఇలా రోడ్డు పనులు చేసే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల బైకర్ ప్రమాదానికి గురవ్వాల్సి వచ్చింది.
Viral Video: కారు వెనుక చూస్తే ఖంగుతింటారు.. యజమాని తెలివి మామూలుగా లేదుగా..
అయితే ఈ ఘటనలో అతను స్వల్ప గాయాలతో బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ ప్రమాదానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి రోడ్లలో వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..