Stunt Viral Video: బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే.. దారిలో కారు అడ్డుగా ఉందని..
ABN , Publish Date - Mar 29 , 2025 | 07:58 AM
అందరికీ సాధ్యం కాని పనులను ఎంతో సులభంగా చేసేస్తుంటారు. కొందరు బైకులను భుజాన మోసుకొని వెళ్తుంటే.. మరికొందరు తమ జుట్టుతో పెద్ద పెద్ద వాహనాలను లాగేస్తుంటారు. ఇలాంటి షాకింగ్ విన్యాసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..

కొందరు చేసే విన్యాసాలు చూస్తే అనితరసాధ్యం అని అనిపిస్తుంటుంది. అందరికీ సాధ్యం కాని పనులను ఎంతో సులభంగా చేసేస్తుంటారు. కొందరు బైకులను భుజాన మోసుకొని వెళ్తుంటే.. మరికొందరు తమ జుట్టుతో పెద్ద పెద్ద వాహనాలను లాగేస్తుంటారు. ఇలాంటి షాకింగ్ విన్యాసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వ్యక్తి చేసిన విచిత్ర విన్యాసం వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘ఇతనెవరో గానీ.. బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి బైకులో వెళ్తుండగా.. దారి మధ్యలో కారు అడ్డుగా ఉంటుంది. ఇలా ఉంటే ఎవరైనా ఏం చేస్తారు.. కారు డ్రైవర్‌ను పిలిచి పక్కకు తీయమని చెబుతారు. లేదా తామే వేరే దారిలో వెళ్తారు.
Viral Video: బ్రష్‌తో బైక్‌నే నడిపించాడుగా.. ఇతడి టెక్నిక్ చూస్తే కళ్లు తేలేస్తారు..
ఇతను కూడా అందిరి లాగే చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఇందుకు పూర్తి విరుద్ధంగా చేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. కారు అడ్డుగా ఉండడం చూసిన అతను.. బైకును పక్కన ఆపి వాహనం దగ్గరికి వెళ్లాడు. కారుకు తన వీపు ఆనించి, (Biker lifts and pushes car) కింద చేతులతో పట్టుకుని పైకి లేపాడు. అలా కారును ఎత్తి పట్టుకుని వెనక్కు జరిపేశాడు. ఇలా చూస్తుండగానే.. కారును పైకి ఎత్తి అదేదో చిన్న రాయిలాగా పక్కకు జరిపేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు.
Kitchen Hacks Viral Video: కొత్తిమీర త్వరగా వాడిపోతోందా.. అయితే ఈ వీడియో మీకోసమే..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఇతడి విన్యాసం మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘బాహుబలిని తలదన్నేలా ఉన్నాడే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1200కి పైగా లైక్‌లు, 1.57 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Train Viral Video: అది రైలా లేక లాడ్జీనా.. లోపల మరీ ఇలా సెట్ చేశారేంట్రా బాబోయ్..
ఇవి కూడా చదవండి..
Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..
Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..
Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..