Funny Dance Video: సినిమాలు చూసి మారిపోయినట్లున్నాయ్.. ఈ మేక, పక్షి కలిసి ఏం చేస్తున్నాయో చూడండి..
ABN , Publish Date - Mar 28 , 2025 | 07:33 AM
ఈమూ పక్షి, మేక ఒకే చోట పెరుగుతుంటాయి. ఒకేచోట పెరగడమే కాదు.. రెండూ స్నేహితుల్లా మారిపోయాయి. అది ఎంతలా అంటే.. ఒక దానికి సంతోషం కలిగితే.. మరొకటి అందులో భాగం పంచుకునేంత అనుబంధం ఏర్పడింది. ఇందుకు నిదర్శనంగా వాటి మధ్య జరిగిన ఓ సన్నివేశం అందరినీ ఆకట్టుకుంటోంది.

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ప్రపంచంలోని అద్భుతాలు, వింతలు, విశేషాలన్నీ క్షణాల్లో మన అర చేతిలోకి వచ్చి చేరుతున్నాయి. కాస్త వినూత్నంగా ఉంటే చాలు.. ఆ వీడియో ఇట్టే నెట్టింట వైరల్ అయిపోతోంది. జంతువులకు సంబంధించిన అనేక వీడియోలను చూస్తుంటాం. శత్రువులుగా ఉన్న జంతువులు మిత్రులుగా మారడం, ఒక జంతువు పిల్లకు మరో జంతువు పాలివ్వడం వంటి విచిత్ర ఘటనలూ చూస్తుంటాం. తాజాగా.. ఓ మేక, పక్షి కలిసి డాన్స్ చేస్తున్న వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ‘‘సినిమాలు చూసి మారిపోయినట్లున్నాయ్’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈమూ పక్షి, మేక ఒకే చోట పెరుగుతుంటాయి. ఒకేచోట పెరగడమే కాదు.. రెండూ స్నేహితుల్లా మారిపోయాయి. అది ఎంతలా అంటే.. ఒక దానికి సంతోషం కలిగితే.. మరొకటి అందులో భాగం పంచుకునేంత అనుబంధం ఏర్పడింది. ఇందుకు నిదర్శనంగా వాటి మధ్య జరిగిన ఓ సన్నివేశం అందరినీ ఆకట్టుకుంటోంది.
Snake Venom: పాము విషం ఈ 5 జంతువులపై పని చేయదు..
యజమాని మ్యాజిక్ ఆన్ చేయగానే.. ముందుగా ఈమూ పక్షి డాన్స్ చేసుకుంటూ.. ‘‘హే.. మేక కమాన్.. డాన్స్ విత్ మి’’.. అంటూ ఎగురుకుంటూ ముందుకు వెళ్లింది. దాని వెనుకే మేక కూడా తన ముందు కాళ్లను గాల్లోకి పెట్టి, డాన్స్ చేసుకుంటూ వెళ్లింది. ఇలా ఆ రెండూ (Emu bird and goat dance) చాలా సేపు మ్యూజిక్‌కు తగ్గట్టుగా డాన్స్ చేశాయి. వీటి డాన్స్ చూసి మురిసిపోయిన యజమాని.. ఈ అరుదైన సందర్భాన్ని తన కెమెరాలో బంధించాడు.
Crocodile Attack Video: వామ్మో.. నీటిలో మొసలి కంట పడ్డ వ్యక్తి.. చివరకు సినిమా తరహా ట్విస్ట్..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్.. మేక, పక్షి డాన్స్ అద్భుతంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘సినిమాలు చూసి డాన్స్ నేర్చుకున్నాయేమో’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 27 వేలకు పైగా లైక్‌లు, 1 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: ఇలాంటి శాడిస్టును ఏం చేయాలో చెప్పండి.. యువతి వెనుక స్కర్టుకు నిప్పంటించడంతో..
ఇవి కూడా చదవండి..
Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..
Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..
Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..