Share News

Train Viral Video: అది రైలా లేక లాడ్జీనా.. లోపల మరీ ఇలా సెట్ చేశారేంట్రా బాబోయ్..

ABN , Publish Date - Mar 28 , 2025 | 12:20 PM

ఓ రైల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలు చూసి అంతా అవాక్కవుతున్నారు. ఓవ్యక్తి కిటికీ వద్ద నిలబడి బయట ప్రదేశాలను వీడియో తీస్తుంటాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. కెమెరాను లోపలికి పాన్ చేయగానే షాకింగ్ సీన్ కనిపించింది. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘అది రైలా లేక లాడ్జీనా’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు..

Train Viral Video: అది రైలా లేక లాడ్జీనా.. లోపల మరీ ఇలా సెట్ చేశారేంట్రా బాబోయ్..

రైలు ప్రయాణాలకు సంబంధించిన అనేక వీడియోలను నిత్యం చూస్తుంటాం. కొందరు రైళ్లలో చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తుంటే.. మరికొందరు సీట్ల కోసం యుద్ధాలు చేస్తుంటారు. ఇంకొందరైతే.. ఏకంగా రైలు పైకి ఎక్కి పడుకుంటుంటారు. ఇలాంటి సంఘటనలను చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. అయితే తాజాగా, అంతా అవాక్కయ్యే ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. రైల్లో సీట్లకు బదులుగా వినూత్నగా చేసిన ఏర్పాట్లను చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ అది రైలా లేక లాడ్జీనా..’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ రైల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలు చూసి అంతా అవాక్కవుతున్నారు. ఓవ్యక్తి కిటికీ వద్ద నిలబడి బయట ప్రదేశాలను వీడియో తీస్తుంటాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. కెమెరాను లోపలికి పాన్ చేయగానే షాకింగ్ సీన్ కనిపించింది. బోగీ మధ్యలో రెండు సైకిళ్లను అటూ, ఇటూ పార్క్ చేశారు.

Dog vs Wolves: కుక్కను చుట్టుముట్టిన తోడేళ్లు.. చివరకు మీ ఊహకందని షాకింగ్ సీన్..


తర్వాత కెమెరాను పక్కకు పాన్ చేయగా.. అంతా అవాక్కయ్యే సీన్ కనిపించింది. సీట్లకు బదులుగా అక్కడ ఏకంగా (Wooden bed in train) ఓ చెక్క మంచం కనిపించింది. దానిపై ఓ వ్యక్తి హాయిగా పడుకుని ఉండగా.. మరో ముగ్గురు కూర్చుని ఉన్నారు. కుర్చీలు ఉండాల్సిన స్థలంలో ఇలా విచిత్రంగా చెక్క మంచం ఉండడం చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు.

Accident Viral Video: వేగంగా వచ్చి సైకిల్‌ను ఢీకొన్న లారీ.. చివరకు సినిమా తరహా ట్విస్ట్..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘అది రైలా.. లేక సుఖ విలాస్ లాడ్జీనా’’.. అంటూ కొందరు, ‘‘దిండు, దుప్పటి కూడా తీసుకెళ్తే బాగుంటుంది కదా’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 57 వేలకు పైగా లైక్‌‌లు, 1.3 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Sandals Viral Video: ఈ చెప్పులకు లైఫ్‌టైం గ్యారెంటీ.. ఎలా తయారు చేశారో చూస్తే.. నోరెళ్లబెడతారు..


ఇవి కూడా చదవండి..

Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..

Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..

Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 28 , 2025 | 12:36 PM