Sandals Viral Video: ఈ చెప్పులకు లైఫ్‌టైం గ్యారెంటీ.. ఎలా తయారు చేశారో చూస్తే.. నోరెళ్లబెడతారు..
ABN , Publish Date - Mar 28 , 2025 | 08:56 AM
ఓ వ్యక్తికి వింత ఆలోచన వచ్చినట్లుంది. ఎప్పటికీ తెగిపోని, పాడవని చెప్పులను తయారు చేద్దామని అనుకున్నట్లున్నాడు. ఇందుకోసం వివిధ రకాలుగా ఆలోచించి, చివరకు అనుకున్నట్లుగానే వింత చెప్పులను తయారు చేశాడు. అతను తయారు చేసిన చెప్పులను చూసి అంతా అవాక్కవుతున్నారు..

వింత వింత ప్రయోగాలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొందరు చేసే విచిత్ర ప్రయోగాలు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఎవరూ చేయని విధంగా, ఎవరూ ఆలోచించని విధంగా సరికొత్తగా ఆలోచిస్తూ ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తయారు చేసిన చెప్పులను చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘ఒట్టు.. ఈ చెప్పులకు వందేళ్ల గ్యారెంటీ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) వైరల్ అవుతోంది. ఓ వ్యక్తికి వింత ఆలోచన వచ్చినట్లుంది. ఎప్పటికీ తెగిపోని, పాడవని చెప్పులను తయారు చేద్దామని అనుకున్నట్లున్నాడు. ఇందుకోసం వివిధ రకాలుగా ఆలోచించి, చివరకు అనుకున్నట్లుగానే వింత చెప్పులను తయారు చేశాడు.
Crocodile Attack Video: వామ్మో.. నీటిలో మొసలి కంట పడ్డ వ్యక్తి.. చివరకు సినిమా తరహా ట్విస్ట్..
ఇందుకోసం పక్కన పడేసిన టైర్ల రబ్బరును సేకరించాడు. వాటిని చెప్పుల ఆకారంలో కత్తిరించి, దానిపై కాళ్లకు గ్రిప్ ఉండేలా వివిధ రకాల డిజైన్లతో రబ్బర్లను తయారు చేసి అతికించాడు. ఇలా ఫైనల్‌గా టైరు రబ్బరుతో (Making sandals from tractor tire rubber) ఒరిజినల్ బ్రాండెండ్ చెప్పులను తయారు చేశాడన్నమాట.
Viral Video: ఇలాంటి శాడిస్టును ఏం చేయాలో చెప్పండి.. యువతి వెనుక స్కర్టుకు నిప్పంటించడంతో..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఇలాంటి చెప్పులను ఎప్పుడూ చూడలేదే’’.. అంటూ కొందరు, ‘‘ఈ చెప్పులకు వందేళ్ల గ్యారెంటీ ఇవ్వొచ్చు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 21 వేలకు పైగా లైక్‌లు, 7.93 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Funny Dance Video: సినిమాలు చూసి మారిపోయినట్లున్నాయ్.. ఈ మేక, పక్షి కలిసి ఏం చేస్తున్నాయో చూడండి..
ఇవి కూడా చదవండి..
Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..
Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..
Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..