Share News

Kitchen Hacks Viral Video: కొత్తిమీర త్వరగా వాడిపోతోందా.. అయితే ఈ వీడియో మీకోసమే..

ABN , Publish Date - Mar 28 , 2025 | 12:53 PM

వంటింట్లో చాలా మంది సర్వసాధారణంగా ఎదుర్కొనే సమస్యల్లో కొత్తిమీర త్వరగా వాడిపోవడం కూడా ఒకటి. ఎంత ఫ్రెష్‌గా ఉన్న కొత్తిమీరను తెచ్చి ఫ్రిజ్‌లో పెట్టినా రోజుల వ్యవధిలోనే అది వాడిపోతుంటుంది. అయితే ఈ సమస్యకు ఓ మహిళ సింపుల్ పరిష్కారాన్ని సూచించింది..

Kitchen Hacks Viral Video: కొత్తిమీర త్వరగా వాడిపోతోందా.. అయితే ఈ వీడియో మీకోసమే..

వంటింటి చిట్కాలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. వంటల్లో ఎదురయ్యే పెద్ద పెద్ద సమస్యలకు కొందరు సింపుల్ చిట్కాలను సూచిస్తుంటారు. మరికొందరు మహిళలను స్మార్ట్‌గా ఆలోచిస్తూ వంటింటి పనులను చకచకా చేయడం కూడా చూస్తుంటాం. ఇలాంటి వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి తెగ హల్‌చల్ చేస్తోంది. కొత్తమీర త్వరగా వాడిపోకుండా ఉండేందుకు ఓ మహిళ చేసిన ప్రయోగం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఈమె తెలివికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. వంటింట్లో చాలా మంది సర్వసాధారణంగా ఎదుర్కొనే సమస్యల్లో కొత్తిమీర (Coriander storage problem) త్వరగా వాడిపోవడం కూడా ఒకటి. ఎంత ఫ్రెష్‌గా ఉన్న కొత్తిమీరను తెచ్చి ఫ్రిజ్‌లో పెట్టినా రోజుల వ్యవధిలోనే అది వాడిపోతుంటుంది. అయితే ఈ సమస్యకు ఓ మహిళ సింపుల్ పరిష్కారాన్ని సూచించింది.

Train Viral Video: అది రైలా లేక లాడ్జీనా.. లోపల మరీ ఇలా సెట్ చేశారేంట్రా బాబోయ్..


ఇందుకోసం ఆమె ముందగా కొత్తిమీరను తీసుకుని, దాన్ని ఓ చిన్న ప్లాస్టిక్ డబ్బాలో నీళ్లపోసి.. అందులో పెట్టింది. ఆ తర్వాత దానిపై పెద్ద ప్లాస్టిక్ డబ్బాను ఉంచి మూత బిగించింది. ఇలా మొత్తం సెట్ చేశాక.. ఆ డబ్బాను ఫ్రిడ్జ్‌లో పెట్టింది. ఇలా చేయడం వల్ల కొన్ని వారాల పాటు కొత్తిమీర ఫ్రెష్‌గా ఉంటుందిన ఆమె చెబుతోంది. కాగా, ఈ విచిత్ర ప్రయోగానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Dog vs Wolves: కుక్కను చుట్టుముట్టిన తోడేళ్లు.. చివరకు మీ ఊహకందని షాకింగ్ సీన్..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ చిట్కా ఏదో చాలా బాగుందో’’.. అంటూ కొందరు, ‘‘ఈమె తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, ‘‘ప్లాస్టిక్ డబ్బాకు బదులుగా గాజు డబ్బాను వాడితే మంచిది’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 22 వేలకు పైగా లైక్‌లు, 1.3 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Sandals Viral Video: ఈ చెప్పులకు లైఫ్‌టైం గ్యారెంటీ.. ఎలా తయారు చేశారో చూస్తే.. నోరెళ్లబెడతారు..


ఇవి కూడా చదవండి..

Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..

Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..

Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 28 , 2025 | 12:53 PM