Share News

Accident Viral Video: వేగంగా వచ్చి సైకిల్‌ను ఢీకొన్న లారీ.. చివరకు సినిమా తరహా ట్విస్ట్..

ABN , Publish Date - Mar 28 , 2025 | 10:52 AM

ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్, అలాగే ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉండడంతో ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరిగినా.. ఆ మరుక్షణమే అవన్నీ కలిసి వీడియోల రూపంలో సోషల్ మీడియాలోకి వచ్చి చేరుతున్నాయి. తాజాగా, ఇలాంటి ఆశ్చర్యకర ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది..

Accident Viral Video: వేగంగా వచ్చి సైకిల్‌ను ఢీకొన్న లారీ.. చివరకు సినిమా తరహా ట్విస్ట్..

‘‘అదృష్టం బాగుండి బతికిపోయా.. కాస్త అటూ, ఇటూ అయినా ప్రాణాలే పోయేవి’’.. ఈ మాటను ఎవరో ఒకరి నోట, ఏదో సందర్భంలో వినిపిస్తుంటుంది. పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగిన సందర్భంలో కొందరు అదృష్టవంతులు క్షేమంగా బయటపడుతుంటారు. ఇలాంటి సందర్భాల్లోనే పై మాటలు వినిపిస్తుంటాయి. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్, అలాగే ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉండడంతో ఇలాంటి సంఘటనలన్నీ వీడియోల రూపంలో సోషల్ మీడియాలోకి వచ్చి చేరుతున్నాయి. తాజాగా, ఇలాంటి ఆశ్చర్యకర ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ లారీ వేగంగా వెళ్తూ సైకిల్‌ను ఢీకొట్టింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు సమూహంగా సైకిళ్లు తొక్కకుంటూ వెళ్తుంటారు. మార్గ మధ్యలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. వేగంగా వచ్చిన ఓ లారీ.. సైక్లిస్ట్‌ను (Lorry hits cycle) ఢీకొని ఆగకుండా వెళ్లిపోతుంది.

Woman: ఓ వైపు కిడ్నీలు పాడైన భర్త.. మరో వైపు 14 రోజుల పసికందు.. చివరకు తల్లి తీసుకున్న షాకింగ్ నిర్ణయం..


లారీ వేగంగా వచ్చి ఢీకొనడంతో సైకిల్ తునాతునలైపోతుంది. వెనుక వస్తున్న వారు ఈ ప్రమాదాన్ని చూసి అతను కూడా చనిపోయి ఉంటాడని అనుకున్నారు. అయితే ఆశ్చర్యకరంగా కొద్దిసేపటి తర్వాత ఆ వ్యక్తి పైకి లేచి నిలబడ్డాడు. అంత పెద్ద ప్రమాదం జరిగినా అతను స్వల్ప గాయాలతో బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Sandals Viral Video: ఈ చెప్పులకు లైఫ్‌టైం గ్యారెంటీ.. ఎలా తయారు చేశారో చూస్తే.. నోరెళ్లబెడతారు..


కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతడి టైం ఎంతో బాగుంది’’.. అంటూ కొందరు, ‘‘అదృష్టం బాగుంటే ఇలాగే అద్భుతాలే జరుగుతుంటాయి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2900కి పైగా లైక్‌‌లు, 4.6 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Funny Dance Video: సినిమాలు చూసి మారిపోయినట్లున్నాయ్.. ఈ మేక, పక్షి కలిసి ఏం చేస్తున్నాయో చూడండి..


ఇవి కూడా చదవండి..

Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..

Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..

Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 28 , 2025 | 10:52 AM