Share News

Viral Video: బ్రష్‌తో బైక్‌నే నడిపించాడుగా.. ఇతడి టెక్నిక్ చూస్తే కళ్లు తేలేస్తారు..

ABN , Publish Date - Mar 28 , 2025 | 01:42 PM

బ్రేక్ హ్యాండిల్ విరిగిపోతే ఎవరైనా ఏం చేస్తారు. వెంటనే కొత్త హ్యాండిల్ కొని సెట్ చేస్తారు. అయితే ఓ వ్యక్తి రూపాయి ఖర్చు లేకుండా విరిగిపోయిన హ్యాండిల్ స్థానంలో కొత్తది అమర్చాడు. ఇతను చేసిన వినూత్న ప్రయోగం చూసి అంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు..

Viral Video: బ్రష్‌తో బైక్‌నే నడిపించాడుగా.. ఇతడి టెక్నిక్ చూస్తే కళ్లు తేలేస్తారు..

‘‘కుక్క పిల్ల, అగ్గి పుల్ల, సబ్బు బిల్ల’’.. కాదే కవితకు అనర్హం అన్న సామెతను కొందరు నిజ జీవితంలో చేసి చూపిస్తుంటారు. పనికి రావని పక్కన పడేసే వస్తువులతో అద్భుతాలు చేస్తుంటారు. ఖాళీ పేస్ట్ డబ్బాను కుళాయి మూతగా వాడడం చూశాం, పాత సైకిల్ చక్కాన్ని డైనిగ్ టేబుల్ వాడడం కూడా చూశాం. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ వ్యక్తి పాత బ్రష్‌ను బైక్‌ విడి భాగాలుగా వాడడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. బ్రేక్ హ్యాండిల్ (Bike brake handle) విరిగిపోతే ఎవరైనా ఏం చేస్తారు. వెంటనే కొత్త హ్యాండిల్ కొని సెట్ చేస్తారు. అయితే ఓ వ్యక్తి రూపాయి ఖర్చు లేకుండా విరిగిపోయిన హ్యాండిల్ స్థానంలో కొత్తది అమర్చాడు.

Kitchen Hacks Viral Video: కొత్తిమీర త్వరగా వాడిపోతోందా.. అయితే ఈ వీడియో మీకోసమే..


బైక్ హ్యాండిల్‌ స్థానంలో పక్న పడేసిన బ్రష్‌ను తగిలించాడు. పాత బ్రష్‌ను (Old brush) హ్యాండిల్‌కు పొడవు తగ్గట్టుగా అమర్చి, అటూ ఇటూ కదలకుండా గట్టిగా అతికించాడు. చివరగా దాన్ని ప్రెస్ చేయగా.. ఆశ్చర్యకరంగా సాధారణ బైక్ హ్యాండిల్ తరహాలోనే ఈ బ్రష్ హ్యాండిల్ పని చేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు.

Train Viral Video: అది రైలా లేక లాడ్జీనా.. లోపల మరీ ఇలా సెట్ చేశారేంట్రా బాబోయ్..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ ఐడియా ఏదో అదిరిందిగా’’.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 9 వేలకు పైగా లైక్‌లు, 2.70 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Dog vs Wolves: కుక్కను చుట్టుముట్టిన తోడేళ్లు.. చివరకు మీ ఊహకందని షాకింగ్ సీన్..


ఇవి కూడా చదవండి..

Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..

Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..

Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 28 , 2025 | 01:42 PM