Viral Video: యోగాలో పండిపోయిన ఏనుగు.. వీడియో చూస్తే ముక్కున వేలేసుకుంటారు..
ABN , Publish Date - Jan 18 , 2025 | 07:26 PM
విచిత్రంగా ప్రవర్తించిన ఏనుగును చూసి అంతా అవాక్కవుతున్నారు. షెడ్‌లో ఉన్న ఏనుగులకు ఓ వ్యక్తి స్నానం చేయిస్తుంటాడు. ఇంతలో ఓ ఏనుగుకు పైపుతో నీళ్లు కొడుతుండగా.. ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అప్పటిదాకా సైలెంట్‌గా ఉన్న ఏనుగు.. అతను నీళ్లు పడుతుండడం చూసి వెంటనే స్పందించింది.

ఏనుగులు చూడటానికి ఎంత గంభీరంగా కనిపిస్తాయో.. కొన్నిసార్లు ఉన్నట్టుండి చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తుంటాం. కిందపడిన వస్తువులను తీసుకుని, పిల్లలకు అందించే ఏనుగును చూశాం. సెల్ఫీ తీసుకునే క్రమంలో ఇబ్బంది పెట్టే వారికి చుక్కలు చూపించిన ఏనుగులను కూడా చూశాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, విచిత్రంగా ప్రవర్తించిన ఓ ఏనుగు వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ‘‘యోగాలో పండిపోయిన ఏనుగు’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. విచిత్రంగా ప్రవర్తించిన ఏనుగును చూసి అంతా అవాక్కవుతున్నారు. షెడ్‌లో ఉన్న ఏనుగులకు ఓ వ్యక్తి స్నానం చేయిస్తుంటాడు. ఇంతలో ఓ ఏనుగుకు పైపుతో నీళ్లు కొడుతుండగా.. ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అప్పటిదాకా సైలెంట్‌గా ఉన్న ఏనుగు.. అతను నీళ్లు పడుతుండడం చూసి వెంటనే స్పందించింది.
కాళ్ల కింద కూడా నీళ్లు పట్టాలని కోరుతూ అతడికి అనుకూలంగా తల కిందకు పెట్టి, ముందు కాళ్ల సాయంతో (elephant performed stunts) వెనుక కాళ్లను గాలిలోకి లేపుతాడు. దీంతో ఆ వ్యక్తి పైపుతో ఏనుగుపై నీళ్లు కొట్టి శుభ్రం చేస్తాడు. ఇలా ఏనుగు స్నానం చేసే సమయంలో యోగాసనం వేయడం చూసి అంతా ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Viral Video: చెట్టుకు కోపం వస్తే ఇలాగే ఉంటుందేమో.. బొప్పాయిని బలవంతంగా కోయాలని చూడగా.. చివరకు..
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ ఏనుగు ఎంతో ప్రొఫెషనల్‌గా యోగా చేస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘ఈ ఏనుగు యోగాతో తన శరీరాన్ని భలే క్లీనింగ్ చేసుకుందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 55 వేలకు పైగా లైక్‌లు, 1.1 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..