Viral Video: అరే..! ఇదేం మాయ.. ఇవి నీళ్లా లేక నిప్పు రవ్వలా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
ABN , Publish Date - Jan 12 , 2025 | 12:51 PM
తెలిసింది గోరంత.. తెలియాల్సింది కొండంత.. అన్న చందంగా, ఈ సృష్టిలో మనకు తెలీకుండా ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి. అవన్నీ అప్పుడప్పుడూ బయటపడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి వింత వింత ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..
తెలిసింది గోరంత.. తెలియాల్సింది కొండంత.. అన్న చందంగా, ఈ సృష్టిలో మనకు తెలీకుండా ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి. అవన్నీ అప్పుడప్పుడూ బయటపడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి వింత వింత ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఓ విచిత్ర ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. చేతి బోరు నుంచి బయటికి వస్తున్న నీటిని చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఇవి నీళ్లా నిప్పు రవ్వలా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ పంచమర్హి (Madhya Pradesh, Panchmarhi) పరిధి పిపారియా అనే ప్రాంతలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి వచ్చే పర్యాటకులు చేతిబోరును చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బోరు నుంచి ఏకధాటిగా నీరు ప్రవహిస్తోంది.
Viral Video: పండుగపూట వాటర్‌ఫాల్స్ వద్దకు వెళ్తున్నారా.. అయితే ఇలాంటి తప్పులు మాత్రం చేయకండి..
ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే ఎవరికీ అంతుచిక్కని ఘటన చోటు చేసుకుంది. నీళ్లపై పేపర్ ముక్కను పెట్టగా (Burning water) భగ్గున మంట మండుతోంది. అయితే నీళ్ల చేత్తో తాకితే మాత్రం ఎలాంటి మంట పుట్టడం లేదు. మళ్లీ పేపర్ టచ్ చేస్తే మాత్రం మంట వెలుగుతోంది. దీంతో అక్కడి వవ్చే పర్యాటకులంతా ఈ నీటిని వింతగా చూస్తున్నారు.
Viral Video: రోటీలు తినేముందు ఇది గమనిస్తున్నారా.. ఇతనెలా చేస్తున్నాడో చూస్తే నోరెళ్లబెడతారు..
చాలా మంది అక్కడికి వచ్చి పేపర్ ముక్కలతో విచిత్ర ప్రయోగాలు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్.. ఇదేంటీ మరీ అద్భుతంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘ఇది నిజమా లేక గ్రాఫిక్సా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వెయ్యికి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral: మిఠాయిలు నమిలిన యువతికి దవడ నొప్పి.. ఆస్పత్రిలో ఎక్స్‌రే తీయగా షాకింగ్ సీన్.. చివరకు..
ఇవి కూడా చదవండి..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..