Optical illusion: మీ కళ్లు పవర్‌ఫుల్‌గా ఉంటే.. ఈ చిత్రంలో దాక్కున్న చేతి గ్లౌజ్‌ను 20 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
ABN , Publish Date - Jan 11 , 2025 | 09:20 PM
మిగతా చిత్రాలతో పోలిస్తే.. ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాలు నెటిజన్లకు కాలక్షేపంతో పాటూ మానసిక ఆరోగ్యం మెరుగుపడేందుకూ దోహదం చేస్తాయి. అలాగే మనలో ఏకాగ్రత మరింత పెరిగేలా కూడా సాయం చేస్తాయి. సోషల్ మీడియాలో నిత్యం అనేక పజిల్స్ మనకు కనిపిస్తుంటాయి. అయితే వాటిలో కొన్ని మనకు పెద్ద పరీక్షను పెడుతుంటాయి. అయితే..
మిగతా చిత్రాలతో పోలిస్తే.. ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాలు నెటిజన్లకు కాలక్షేపంతో పాటూ మానసిక ఆరోగ్యం మెరుగుపడేందుకూ దోహదం చేస్తాయి. అలాగే మనలో ఏకాగ్రత మరింత పెరిగేలా కూడా సాయం చేస్తాయి. సోషల్ మీడియాలో నిత్యం అనేక పజిల్స్ మనకు కనిపిస్తుంటాయి. అయితే వాటిలో కొన్ని మనకు పెద్ద పరీక్షను పెడుతుంటాయి. అయితే కాస్త నిశితంగా పరిశీలిస్తే.. అలాంటి పజిల్స్‌ను పరిష్కరించడం పెద్ద కష్టమేమీ కాదు. ప్రస్తుతం మీ కోసం అలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోను తీసుకొచ్చాం. ఇక్కడ మీకు కనిపిస్తు్న్న చిత్రంలో చేతి గ్లౌజ్ దాక్కుని ఉంది. దాన్ని 20 సెకన్లలో కనుక్కున్నారంటే మీ చూపు పవర్‌ఫుల్‌గా ఉన్నట్లే..
సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion Viral Photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ కుటుంబం తమ ఇంట్లో క్రిస్మస్ వేడుకులను జరుపుకొంటోంది. భర్త చేతిలో ఓ పాత్ర పట్టుకని ఉండగా.. భార్య అతడి పక్కనే నిలబడి ఉంటుంది. వారి పక్కనే పెద్ద క్రిస్మస్ చెట్టు కూడా ఉంటుంది. అలాగే ఆ పక్కనే వారి పిల్లలు ఆడుకుంటూ ఉంటారు.
గోడపై రెండు ఫొటోలు, పక్కన పెద్ద కిటీకీతో పాటూ తలుపును కూడా చూడొచ్చు. అదే విధంగా దంపుతలకు ముందు ఓ టేబుల్‌పై రెండు కుండీల తరహాలో ఉన్న వస్తువులు, స్టిక్‌లు ఉంచిన బకెట్‌ను కూడా చూడొచ్చు. ఇంతకు మించి మనకు ఈ చిత్రంలో చేతి గ్లౌజ్ మాత్రం కనిపించదు.
కానీ మీకు తెలీని విషయం ఏంటంటే.. చేతి గ్లౌజ్ మీ కంటికి కనిపించకుండా (hidden hand glove) ఇదే చిత్రంలోనే దాక్కుని ఉంది. దాన్ని కనుక్కోవడం అంత సులభం కాదు.. అలాగని అంత పెద్ద కష్టం కూడా కాదు. ఈ చిత్రం పైనే దృష్టి నిలిపి, చూస్తే ఆ గ్లౌజ్ ఎక్కడుందో గుర్తుపట్టవచ్చు. చాలా మంది ఆ గ్లౌజ్‌ను గుర్తించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కొందరు మాత్రమే దాన్ని గుర్తించగలుగుతున్నారు.
Optical illusion: చురుకైన చూపుగలవారు మాత్రమే.. జింకను వేటాడేందుకు దాక్కున్న పులిని గుర్తించగలరు..
ఇంకెందుకు ఆలస్యం మీరూ ఒకసారి ప్రయత్నించండి. ఎంత సేపు చూసినా మీ వల్ల కూడా గ్లౌజ్‌ను గుర్తించడం సాధ్యం కాకపోతే కంగారు అవసరం లేదు. ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి..
Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..
Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న అతి పెద్ద తప్పును పసిగట్టగలరేమో ప్రయత్నించండి..
మరిన్ని వైరల్ వార్తల కోసంఇక్కడ క్లిక్ చేయండి..