Share News

Viral Video: వామ్మో..! ఇదేంట్రా బాబోయ్.. రైల్లో సీటు కోసం వీళ్లు చేస్తున్న నిర్వాకం చూస్తే..

ABN , Publish Date - Jan 19 , 2025 | 08:34 PM

రైలు ప్రయాణం ఎంత అనుభూతిని కలిగిస్తుందో.. కొన్నిసార్లు అంతే ఇబ్బందిని కూడా కలిగిస్తుంటుంది. ముఖ్యంగా జనరల్ బోగీల్లో ప్రయాణించే వారి పరిస్థితి కొన్నిసార్లు దారుణంగా ఉంటుంది. సీటు కోసం కుస్తీలు పట్టాల్సిన పరిస్థితి వస్తుంటుంది. ఇక పండుగ వేళలు, ప్రత్యేక దినాల్లో రద్దీ ఎలా ఎంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రైళ్లలో..

Viral Video: వామ్మో..! ఇదేంట్రా బాబోయ్.. రైల్లో సీటు కోసం వీళ్లు చేస్తున్న నిర్వాకం చూస్తే..

రైలు ప్రయాణం ఎంత అనుభూతిని కలిగిస్తుందో.. కొన్నిసార్లు అంతే ఇబ్బందిని కూడా కలిగిస్తుంటుంది. ముఖ్యంగా జనరల్ బోగీల్లో ప్రయాణించే వారి పరిస్థితి కొన్నిసార్లు దారుణంగా ఉంటుంది. సీటు కోసం కుస్తీలు పట్టాల్సిన పరిస్థితి వస్తుంటుంది. ఇక పండుగ వేళలు, ప్రత్యేక దినాల్లో రద్దీ ఎలా ఎంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రైళ్లలో రద్దీకి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. రైల్లోకి ఎక్కేందుకు ప్రయాణికులు పడ్డ పాట్లు చూసి అంతా అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ్ (mahakumbh 2025) కార్యక్రమానికి దేశంలోని నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బస్సులు, రైళ్లలో రద్దీ నెలకొంది. ఇక రైల్వే స్టేషన్లలో అయితే ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంది. ఈ క్రమంలో ప్రయాగ్‌రాజ్‌లోని రైల్వే స్టేషన్‌లో (Railway station) షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్థానిక రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ప్రయాణికులు.. ఎలాగైనా రైల్లో సీటు సంపాదించుకోవడం కోసం పడరాని పాట్లన్నీ పడ్డారు.

Viral Video: హైనాలే కదా అని తక్కువ అంచనా వేస్తున్నారా.. ఈ సింహం పరిస్థితి ఏమైందో చూడండి..


రైలు ఫ్లాట్‌పామ్‌పైకి రాకముందే అందులోకి చేరుకుంటే సీట్లు దక్కుతాయనే ఉద్దేశంతో అంతా ఒక్కసారిగా రైలు ఆగి ఉన్న చోటుకు చేరుకున్నారు. జనరల్ బోగీ వద్దకు ప్రయాణికులంతా ఒకేసారి చేరుకుని లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. డోర్లు లాక్ చేసి ఉన్నా కూడా ఎలాగోలా లోపలికి దూరిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. దీన్ని గమనించిన పోలీసులు, సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. వారిని ఎంత వారించినా ప్రయోజనం లేకపోవడంతో చివరకు వినూత్నమైన ట్రిక్‌ను ప్రయోగించారు.

Viral Video: దోచుకోవడానికి వచ్చిన దొంగకు వింత సర్‌ప్రైజ్.. చివరకు అంతా కలిసి ఇలా చేశారేంటీ..


పోలీసు సిబ్బంది నీళ్ల పైపుతో అక్కడికి వచ్చాడు. బోగీ పక్కన ఉన్న వారిపై నీళ్లు కొట్టడంతో అంతా దూరంగా పారిపోయారు. ఇలా సులభంగా వారందరినీ బోగీ దగ్గరి నుంచి దూరంగా పంపించారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘వామ్మో.. రద్దీ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి సమయాల్లో రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనపు రైళ్లు వేయాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 38 వేలకు పైగా లైక్‌లు, 6.4 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 19 , 2025 | 08:34 PM