Share News

Viral Video: ఐఫోన్ దొంగను చితకబాదిన యువకులు.. మధ్యలో ఫోన్ స్ర్కీన్ చూడగా షాకింగ్ సీన్.. చివరకు..

ABN , Publish Date - Jan 21 , 2025 | 08:22 AM

రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో మార్గ మధ్యలో ఓ యువకుడి ఐ ఫోన్ కనిపించకుండాపోతుంది. దీంతో అతను కంగారుపడి మొత్తం వెతుకుతాడు. అయినా ఫోన్ కనిపించకపోవడంతో చోరీకి గురైందని తెలుసుకుంటాడు. ఆ వెంటనే తన చుట్టూ ఉన్న వారిని గమనిస్తుంటాడు. ఇంతలో..

Viral Video: ఐఫోన్ దొంగను చితకబాదిన యువకులు.. మధ్యలో ఫోన్ స్ర్కీన్ చూడగా షాకింగ్ సీన్.. చివరకు..

కొన్నిసార్లు మన కళ్లు మనల్ని మోసం చేస్తుంటాయి. అంతా తప్పు అనుకున్నది ఒప్పు కావొచ్చు.. అలాగే ఒప్పు అనుకున్నది కాస్త కొన్నిసార్లు తప్పు కావొచ్చు. అందుకే కళ్లతో చూసి జడ్జిమెంట్ చేయొద్దని పెద్దలు చెబుతుంటారు. కానీ కొందరు తాము చూసిందే నిజం అనే భ్రమలో ఉంటారు. ఇలాంటి సమయాల్లో చివరకు అసలు విషయం తెలుసుకుని నాలుక్కరుకోవాల్సిన పరిస్థితి వస్తుంటుంది. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కొందరు యువకులు ఐఫోన్ దొంగను పట్టుకుని చితకబాదారు. అయితే చివరకు ఫోన్ స్క్రీన్‌ చూసి అయ్యారు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రైల్లో (train) ప్రయాణిస్తున్న సమయంలో మార్గ మధ్యలో ఓ యువకుడి ఐ ఫోన్ (i phone) కనిపించకుండాపోతుంది. దీంతో అతను కంగారుపడి మొత్తం వెతుకుతాడు. అయినా ఫోన్ కనిపించకపోవడంతో చోరీకి గురైందని తెలుసుకుంటాడు. ఆ వెంటనే తన చుట్టూ ఉన్న వారిని గమనిస్తుంటాడు. ఇంతలో అతడి కళ్లు అక్కడే ఉన్న ఓ యువకుడిపై పడ్డాయి.

Viral Video: గుండెను పిండేసే సీన్.. కోతిని చుట్టేసిన కొండచిలువ.. కాపాడమంటూ హాహాకారాలు.. చివరకు..


ఆ యువకుడి చేతిలోనూ ఐ ఫోన్ ఉండడంతో.. (Assault on youth) దొంగ అతనే అనుకుని పట్టుకుని కొడతాడు. రైలు స్టేషన్‌లో ఆగగానే.. సదరు యువకుడి చొక్కా పట్టుకుని కిందకు లాక్కొస్తారు. తర్వాత కూడా అతడిని బూతులు తిడుతూ పదే పదే కొడుతుంటారు. ఈ ఘటనతో చుట్టూ ఉన్న వారంతా అక్కడ గుమికూడతారు. ఓ వ్యక్తి అక్కడికి వెళ్లి వారిని విడిపించే ప్రయత్నం చేస్తాడు. ఇంతలో దొంగ అని భావిస్తు్న్న యువకుడు.. ‘‘తాను ఎలాంటి దొంగతనం చేయలేదని.. ఈ ఫోన్ నాదే.. కావాలంటే స్క్రీన్‌పై నా ఫొటో చూడండి’’.. అంటూ అన్‌లాక్ చేసి, తన ఫోటో చూపిస్తాడు.

Viral Video: కక్కుర్తిలో పరాకాష్ట అంటే ఇదేనేమో.. పెళ్లిలో ఈ సీన్ చూస్తే కళ్లు తేలేస్తారు..


ఫోన్ స్క్రీన్‌పై ఫొటో చూడగానే అప్పటిదాకా అతన్ని దొంగ అనుకుని కొట్టిన వ్యక్తి.. తన తప్పు తెలుసుకుని మెల్లగా అక్కడి నుంచి జారుకుంటాడు. ఇలా ఎలాంటి తప్పూ చేయని యువకుడిని దొంగ అనుకుని దాడి చేసిన సదరు వ్యక్తిపై అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘కళ్లతో చూసి నిర్ధారణకు రాకూడదు’’.. అంటూ కొందరు, ‘‘అనుమానంతో ఇలా దాడి చేయడం కరెక్ట్ కాదు.. అతన్ని వెంటనే శిక్షించాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.25 లక్షలకు పైగా లైక్‌లు, 4.1 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 21 , 2025 | 08:22 AM