Share News

Viral Video: హైనాలే కదా అని తక్కువ అంచనా వేస్తున్నారా.. ఈ సింహం పరిస్థితి ఏమైందో చూడండి..

ABN , Publish Date - Jan 19 , 2025 | 08:25 PM

అడవిలో వేటకు వెళ్లిన సింహాలు వేచి చూస్తుంటాయి. ఇంతలో వాటికి హైనాలు కనిపిస్తాయి. అప్పటికే హైనాలు కూడా ఆకలితో ఉండడంతో చివరకు అవన్నీ కలిసి ఓ సింహాన్ని టార్గెట్ చేస్తాయి. మూకుమ్మడిగా దాడి చేసి సింహాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: హైనాలే కదా అని తక్కువ అంచనా వేస్తున్నారా.. ఈ సింహం పరిస్థితి ఏమైందో చూడండి..

అడవి జంతువుల మధ్య కొన్నిసార్లు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. అలాగే మరికొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. వేటకు వెళ్లే సింహాలు తోక ముడిచి పారిపోవాల్సి వస్తుంటుంది. కొన్నిసార్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోవాల్సి వస్తుంటుంది. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి విచిత్ర ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. సింహాన్ని చుట్టుముట్టిన హైనాలు మూకుమ్మడిగా దాడి చేశాయి. చివరకు ఏమైందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. అడవిలో వేటకు వెళ్లిన సింహాలు వేచి చూస్తుంటాయి. ఇంతలో వాటికి హైనాలు కనిపిస్తాయి. అప్పటికే హైనాలు కూడా ఆకలితో ఉండడంతో చివరకు అవన్నీ (Hyenas attack a lion) కలిసి ఓ సింహాన్ని టార్గెట్ చేస్తాయి. మూకుమ్మడిగా దాడి చేసి సింహాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. హైనాలు ఇలా ఊహించని విధంగా దాడి చేయడంతో సింహం షాక్ అవుతుంది.

Viral Video: దోచుకోవడానికి వచ్చిన దొంగకు వింత సర్‌ప్రైజ్.. చివరకు అంతా కలిసి ఇలా చేశారేంటీ..


హైనాల నుంచి విడిపించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంది. అయినా హైనాలు మాత్రం సింహాన్ని చుట్టుముట్టి చంపేందుకు ప్రయత్నిస్తాయి. అయితే ఇంతలో అక్కడే ఉన్న మిగతా సింహాలన్నీ అలెర్ట్ అవుతాయి. హైనాలపై ఎదురుదాడి చేసి బాధిత సింహాన్ని రక్షిస్తాయి. తర్వాత చాలా సేపు సింహాలు, హైనాల మధ్య పోటాపోటీగా ఫైట్ జరుగుతుంది. ఈ ఘటన మొత్తం పర్యాటకుల సమక్షంలోనే జరుగుతుంది.

Viral Video: ఏమైందిరా..! ఓ వైపు ఊరేగింపు జరుగుతుండగా.. మరోవైపు వీళ్ల నిర్వాకం చూస్తే.. పగలబడి నవ్వుతారు..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘సింహానికి చుక్కలు చూపించిన హైనాలు’’.. అంటూ కొందరు, ‘‘వామ్మో.. హైనాల పవర్ మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 34 వేలకు పైగా లైక్‌లు, 1.3 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 19 , 2025 | 08:25 PM