Share News

Viral Snake Video: కుర్చీలో కూర్చున్న పిల్లాడు.. పక్కనే పడుకున్న పాము.. చివరకు ఎవరూ ఊహించని ట్విస్ట్..

ABN , Publish Date - Mar 15 , 2025 | 07:46 PM

ఓ పిల్లాడు కుర్చీలో కూర్చుని ఆడుకుంటాడు. ఇంతలో ఓ పాము కుర్చీ పైకి ఎక్కి పిల్లాడి పక్కలో పడుకుండిపోతుంది. పామును చూడగానే భయపడి ఏడవాల్సిన పిల్లాడు.. అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Snake Video: కుర్చీలో కూర్చున్న పిల్లాడు.. పక్కనే పడుకున్న పాము.. చివరకు ఎవరూ ఊహించని ట్విస్ట్..

పామును సమీపానికి రావడం కాదు.. కనీసం దూరం నుంచి చూసినా కూడా ఒళ్లు జలదరిస్తుంది. ఇక పిల్లలైతే వాటికి ఆమడ దూరంలో ఉంటారు. అయితే కొందరు పిల్లలు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తుంటారు. పాములను చూసినా భయపడకుండా వాటి సమీపానికి వెళ్తుంటారు. మరికొందరైతే ఏకంగా వాటితోనే ఆడుకుంటుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ పిల్లాడు కుర్చీలో కూర్చుని ఉండగా.. పక్కనే పాము పడుకుని ఉంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ పిల్లాడు కుర్చీలో కూర్చుని ఆడుకుంటాడు. ఇంతలో ఓ పాము కుర్చీ పైకి ఎక్కి పిల్లాడి పక్కలో పడుకుండిపోతుంది. పామును చూడగానే భయపడి ఏడవాల్సిన పిల్లాడు.. అందుకు పూర్తి విరుద్ధంగా ఆ పాముతో ఆడుకుంటాడు. పామును మెడలో వేసుకోవడం, దాని తలను పట్టుకుని గమనించడం వంటివి చేస్తుంటాడు.

Couple Viral Video: అందరి మనసూ దోచుకున్నారుగా.. రైల్లో ఈ దంపతులు చేస్తున్న పని చూస్తే..


పాము అనే భయం కొంచెం కూడా లేకుండా బుడ్డోడు ప్రవర్తించడం చూసి అక్కడున్న వారంతా అవాక్కవుతున్నారు. విషయానికొస్తే.. స్నేక్ క్యాచర్ అయిన ఓ వ్యక్తి పాములను పట్టుకుని, వాటిని క్షేమంగా అడవుల్లో వదిలేస్తుంటాడు. వాటిని వీడియోలు తీసి, సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. ఈ క్రమంలో అతడి ఇంట్లోని పిల్లలకూ పాములను అలవాటు చేశాడు. రోజూ చూస్తుండడంతో ఆ పిల్లాడు పాము అనే (child playing with snake) భయం లేకుండా ఇలా ఆడుకుంటున్నాడు. అయితే పిల్లలకు ఇలా అలవాటు చేయడంపై అంతా మండిపడుతున్నారు.

Accident Viral Video: ఒకరి గొడవకు ఇంకొకరు బలవడమంటే ఇదే.. నడుస్తూ వెళ్తున్న యువతి.. చూస్తుండగానే..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఇదేంటీ మరీ విచిత్రంగా ఉందే.. పిల్లాడికి కొంచెం కూడా భయం లేదు’’.. అంటూ కొందరు, ‘‘పిల్లలకు ఇలా అలవాటు చేస్తే.. రేపు విషపూరిత పామును కూడా పట్టుకుంటాడు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌‌‌లు, 12. 9 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Dogs Viral Video: కుక్కలకు మానవత్వం కూడా ఎక్కువే.. యువతి కిండపడడం చూసి..


ఇవి కూడా చదవండి..

Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..

Funny Viral Video: రేకుల షెడ్డుపై రీల్ చేసింది.. చివరకు జరిగింది చూసి ఖంగుతింది..

Viral Video: టెక్నిక్‌తో పని చేయడమంటే ఇదే.. సిమెంట్ బస్తాలను ఎంత సింపుల్‌గా అన్‌లోడ్ చేస్తున్నాడో చూస్తే..

Updated Date - Mar 15 , 2025 | 07:46 PM