Share News

Mosquito Funny Video: ఇంకా ట్రైనింగ్‌లోనే ఉందేమో.. చేతిపై ఈ దోమ నిర్వాకం చూస్తే.. నవ్వకుండా ఉండలేరు..

ABN , Publish Date - Apr 04 , 2025 | 10:55 AM

ఓ దోమ చేతిపై వాలి కుట్టడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో నవ్వుకోవడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారు కదా. చేతిపై వాలిన దోమ రక్తం పీల్చే క్రమంలో ప్రవర్తించిన తీరు చూసి అంతా అవాక్కవుతున్నారు.. ఈ వీడియో చూసిన వారంతా ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు..

Mosquito Funny Video: ఇంకా ట్రైనింగ్‌లోనే ఉందేమో.. చేతిపై ఈ దోమ నిర్వాకం చూస్తే.. నవ్వకుండా ఉండలేరు..

దోమల బెడద ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చేతిపై వాలాయంటే చాలు.. రక్తాన్ని పీల్చేదాకా వదలవు. ఫ్రీగా రక్తాన్ని పీల్చేయడమే కాకుండా.. వెళ్తూ వెళ్తూ మలేరియా, టైఫాయిడ్ వంటి రోగాలను బహుమతిగా ఇచ్చి వెళ్తుంటాయి. దీంతో ప్రతి ఒక్కరూ వీటి నివారణకు పడరాన్ని పాట్లన్నీ పడుతుంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఓ దోమ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చేతిపై వాలిన దోమ నిర్వాకం చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘దోమలు కూడా ట్రైనింగ్‌లో ఉంటాయా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ దోమ చేతిపై (mosquito trying to bite on hand) వాలి కుట్టడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో నవ్వుకోవడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారు కదా. దోమ కుట్టడానికి ప్రయత్నిస్తోంది కానీ.. ఎలా కుట్టాలో దానికి తెలియడం లేదు.

Currency Notes: కరెన్సీ నోట్ల తయారీకి ముందు జరిగే ప్రక్రియ గురించి తెలుసా..


తన ముందున్న తొండంతో చేతిపై గుచ్చాలని చూస్తోంది కానీ.. అది బలహీనంగా ఉండడంతో రక్తాన్నీ పీల్చడం దాని వల్ల కావట్లేదు. ఎన్నిసార్లు ప్రత్నించినా చర్మంపై గుచ్చడం మాత్రం సాధ్యం కాలేదు. కొత్తగా డ్యూటీలోకి వచ్చిన వారిలా.. ఈ దోమ కూడా రక్తం పీల్చడంలో అనుభవం లేనట్లుగా ప్రవర్తిస్తోంది. ఇలా చాలా సేపు కుట్టాలని చూసినా దాని వల్ల కావట్లేదన్నమాట.

Viral Video: మరణాన్ని గెలవడమంటే ఇదేనేమో.. చితిపై పడుకోబెట్టగానే ఏం జరిగిందో చూడండి..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ దోమ ఇంకా ట్రైనింగ్‌లోనే ఉన్నట్టుంది’’.. అంటూ కొందరు, ‘‘దోమకు జబ్బు చేసినట్లుంది పాపం.. డ్యూటీ చేయలేకపోతోంది’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 12వేలకు పైగా లైక్‌లు, 1.2 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Snake Viral Video: పరాయి సొమ్ముపై ఆశపడితే ఇలాగే అవుతుంది.. పనసకాయ చెట్టుపై పాము చేసిన పని చూస్తే..


ఇవి కూడా చదవండి..

Crow viral video: మాట్లాడే కాకిని ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

Stunt Viral Video: బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే.. దారిలో కారు అడ్డుగా ఉందని..

Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 04 , 2025 | 10:55 AM