Share News

Viral Video: మెల్‌బోర్న్‌‌ రోడ్లపై యువతి ఆసక్తికర కామెంట్స్.. ఇండియాకు రాగానే అదే చేస్తానంటూ..

ABN , Publish Date - Apr 03 , 2025 | 11:54 AM

స్టాండ్-అప్ కమెడియన్ అయిన సుముఖి సురేష్ అనే యువతి ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ పర్యటనకు వెళ్లింది. ఈ సందర్భంగా అక్కడి రోడ్లపై నడుస్తూ వీడియో చేసింది. మెల్‌బోర్న్ వాతావరణం తనని ఎంతగానో ఆకట్టుకుందని చెప్పింది. ఆమె కామెంట్స్‌పై నెటిజన్లు ఏమంటున్నారంటే..

Viral Video: మెల్‌బోర్న్‌‌ రోడ్లపై యువతి ఆసక్తికర కామెంట్స్.. ఇండియాకు రాగానే అదే చేస్తానంటూ..

విదేశాలకు వెళ్లిన సందర్భాల్లో అక్కడి మెయింటెనెన్స్ చూసినప్పుడు చాలా మంది స్వదేశంతో పోల్చుకుంటుంటారు. కొన్ని విషయాల్లో విదేశాలను మెచ్చుకుంటుంటే.. మరికొన్ని అంశాల్లో ఇండియానే బెస్ట్ అంటూ చెబుతుంటారు. ముఖ్యంగా ట్రాఫిక్, పర్యావరణ పరిరక్షణ తదితర విషయాల్లో విదేశాలతో పోల్చుతూ అనేక కామెంట్స్ వినపడుతుంటాయి. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. మెల్‌బోర్న్ రోడ్లపై చక్కర్లు కొడుతున్న ఓ యువతి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అలాగే ఆమె అక్కడి వాతావరణం గురించి చెబుతూ చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. స్టాండ్-అప్ కమెడియన్ అయిన సుముఖి సురేష్ (stand-up comedian Sumukhi Suresh) అనే యువతి ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ పర్యటనకు (Melbourne tour) వెళ్లింది. ఈ సందర్భంగా అక్కడి రోడ్లపై నడుస్తూ వీడియో చేసింది. మెల్‌బోర్న్ వాతావరణం తనని ఎంతగానో ఆకట్టుకుందని చెప్పింది. ఫిర్యాదు చేయడానికి ఎలాంటి సమస్యలూ లేవని కూడా చెప్పింది.

Snake Viral Video: ఈ పాము మరీ కామెడీగా ఉందే.. బాత్‌రూంలోకి వెళ్లిన వ్యక్తిని ఎలా భయపెట్టిందో చూస్తే..


మెల్‌బోర్న్‌లోని స్వచ్ఛమైన గాలి, సక్రమంగా నిర్వహిస్తున్న ఫుట్‌పాత్‌లు, దోమలే లేని వాతావరణం తనకు బాగా నచ్చిందని పేర్కొంది. ఈ క్రమంలో రోడ్డు దాటుతుండగా కారు ఆగడం చూసి అవాక్కైంది. ‘‘చూశారా.. నేను రోడ్డు దాటుతుంటే వాహనాలు ఆగిపోతున్నాయి’’.. అంటూ అక్కడి ట్రాఫిక్ నిబంధనల గురించి కూడా ప్రస్తావించింది. అయితే తనకు ఆలూతో చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ నచ్చలేదని తెలిపింది. అలాగే మధ్యాహ్నం 3 గంటల సమయంలో అక్కడి పార్క్‌లో పడుకుని ఉన్న వ్యక్తిని చూపించి, సమయం వృథా చేసే కంటే జాబ్ చూసుకోవాలని సలహాలు కూడా ఇస్తుంది.

Swimming Viral Video: ఈతకు వెళ్తుంటే ఇలా మాత్రం చేయొద్దు.. ఈ యువకుడికి ఏమైందో చూడండి..


మొత్తం మీద మెల్‌బోర్న్ వాతావరణం తనకు బాగా నచ్చిందని, ఇండియా రాగానే ఈ విషయాలపై ఫిర్యాదు చేయాలని అనుకుంటున్నానంటూ తన మనసులో మాట చెప్పేసింది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘కొందరికి ఫిర్యాదు చేయడమే అలవాటు’’.. అంటూ కొందరు, ‘‘మెల్‌బోర్న్ వాతావరణం చాలా బాగుంటుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందర కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 30 వేలకు పైగా లైక్‌లు, 4.92 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Woman Viral Video: ఆంటీకి, అమ్మాయికి మధ్య వింత పోటీ.. చివరకు ఏమైందో చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Crow viral video: మాట్లాడే కాకిని ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

Stunt Viral Video: బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే.. దారిలో కారు అడ్డుగా ఉందని..

Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 03 , 2025 | 11:54 AM