Share News

Funny Viral Video: సర్వింగ్‌లో షాకింగ్ అంటే ఇదేనేమో.. యువతి విన్యాసం చూస్తే..

ABN , Publish Date - Apr 03 , 2025 | 12:52 PM

బార్‌లో వెయిట్రెస్‌గా పని చేస్తున్న యువతి.. అంతా అవాక్కయ్యేలా సర్వ్ చేస్తోంది. బీర్ మగ్‌లు సర్వ్ చేసే వారు సాధారణంగా ఒకటి, లేదా రెండు మగ్‌లు తీసుకుని టేబుళ్ల వద్దకు సర్వ్ చేస్తుంటారు. అయితే ఈమె మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు..

Funny Viral Video: సర్వింగ్‌లో షాకింగ్ అంటే ఇదేనేమో.. యువతి విన్యాసం చూస్తే..

కొందరు చూడ్డానికే అమ్మాయిలు.. వారి టాలెంట్ చూస్తే అబ్బాయిలు కూడా దిగదుడుపే.. అన్నట్లుగా ఉంటుంది. మరికొందరు యువుతులు మగవారు కూడా చేయలని పనులను ఎంతో సులభంగా చేసేస్తుంటారు. ఇంకొందరు యువతులు చేసే విన్యాసాలు చూస్తే.. ‘‘నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్’’.. అనే విధంగా ఉంటాయి. ఇలాంటి విచిత్ర విన్యాసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువతి బీర్ మగ్‌లను సర్వ్ చేసే విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘సర్వింగ్‌లో షాకింగ్ అంటే ఇదేనేమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. బార్‌లో వెయిట్రెస్‌గా (Waitress) పని చేస్తున్న యువతి.. అంతా అవాక్కయ్యేలా సర్వ్ చేస్తోంది. బీర్ మగ్‌లు సర్వ్ చేసే వారు సాధారణంగా ఒకటి, లేదా రెండు మగ్‌లు తీసుకుని టేబుళ్ల వద్దకు సర్వ్ చేస్తుంటారు. అయితే ఈమె మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా చేసింది.

Viral Video: మెల్‌బోర్న్‌‌ రోడ్లపై యువతి ఆసక్తికర కామెంట్స్.. ఇండియాకు రాగానే అదే చేస్తానంటూ..


అందరిలా చేస్తే తన టాలెంట్ ఏముంటుందీ.. అని అనుకుందో ఏమో గానీ.. విచిత్రంగా సర్వ్ చేసి అంతా అవాక్కయ్యేలా చేసింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా లీటరు పరిమాణం గల 13 బీరు మగ్‌లను (young woman carrying 13 beer mugs) రెండు చేతులతో పట్టుకుని టేబుల్స్ వద్దకు తీసుకెళ్లింది. ఈమె విచిత్ర విన్యాసం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Woman Viral Video: ఆంటీకి, అమ్మాయికి మధ్య వింత పోటీ.. చివరకు ఏమైందో చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్... ఈమె టాలెంట్ మాలమూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘13 బీర్ మగ్‌ల బరువు సుమారు 19 కేజీలకు పైగానే ఉంటుంది.. అన్ని మగ్‌లను ఎంతో సులభంగా తీసుకెళ్లడం గ్రేట్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2,600కి పైగా లైక్‌లు, 2 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Monkey Viral Video: ఈ కోతి వెరీ స్మార్ట్ గురూ.. నీళ్లపై ఎలా వెళ్లిందో చూస్తే.. నోరెళ్లబెడతారు..


ఇవి కూడా చదవండి..

Crow viral video: మాట్లాడే కాకిని ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

Stunt Viral Video: బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే.. దారిలో కారు అడ్డుగా ఉందని..

Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 03 , 2025 | 12:52 PM