Share News

India vs Pakistan Army: ఇప్పటికిప్పుడు యుద్ధం వస్తే.. ఎవరిది గెలుపు.. బలాబలాలు, బలహీనతలు ఇవే..

ABN , Publish Date - Apr 03 , 2025 | 10:22 AM

భారత్, పాకిస్తాన్‌ పేర్లు బద్ధ శత్రువులు గుర్తుకొస్తారు. ఈ రెండు దేశాల మధ్య నిత్యం ఘర్షణ వాతావరణం నెలకొని ఉంటుంది. అలాగే ఈ రెండు దేశాల బలాబలాలపై కూడా అందరి దృష్టి నెలకొని ఉంటుంది . తాజాగా, భారత్, పాక్ ఆర్మీలో దేని బలం ఎంతుంది, యుద్ధం వస్తే గెలుపు ఎవరది.. అనే ఆంశాలపై అంతా ఆసక్తికర చర్చ నడుస్తొంది. ఈ నేపథ్యంలో ఈ రెండు దేశాల బలాబలాలపై ఓ లుక్కేద్దాం..

India vs Pakistan Army: ఇప్పటికిప్పుడు యుద్ధం వస్తే.. ఎవరిది గెలుపు.. బలాబలాలు, బలహీనతలు ఇవే..

భారత్, పాకిస్థాన్.. ఈ రెండు పేరుకు దాయాది దేశాలైనా నిత్యం యుద్ధ వాతావరణమే నడుస్తుంటుంది. అలాగే ఈ రెండు దేశాల బలాబలాలపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతుంటుంది. 1947లో రెండు దేశాలు విడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకూ మొత్తం నాలుగు సార్లు యుద్ధాలు జరిగాయి. ఇక రెండు దేశాల సరిహద్దులో అయితే క్షణ క్షణం ఉత్కంఠ పరిస్థితులు నెలకొని ఉంటాయి. కాశ్మీర్ విషయంలో భారత్, పాక్ మధ్య ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలో నెట్టింట మళ్లీ ఈ రెండు దేశాల బలాబలాలపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. భారత్, పాక్ ఆర్మీ బలాబలాలు, బలహీనతలు, రెండు ఆర్మీల మధ్య తేడాలు, యుద్ధంలో గెలుపు అవకాశాలు ఏ దేశానికి ఉన్నాయనే అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


bharath-army.jpg

భారత ఆర్మీ సైనిక సంఖ్య, నిర్మాణం..

భారత ఆర్మీ (Indian Army) సుమారు 25 లక్షల మంది సైన్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక దళాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సైన్యంలో సుమారు 14 లక్షల మంది యాక్టివ్ సైనికులు ఉన్నారు. అదేవిధంగా 12 లక్షల మంది రిజర్వ్‌ సైనికులు ఉన్నారు. ఈ సైన్యం అవసరమైనప్పుడు రంగంలోకి దిగుతారు. అలాగే భారత ఆర్మీ 14 కార్ప్స్‌లుగా విభజించబడి ఉంది. 40 డివిజన్లలో ఇన్‌ఫాంట్రీ, ఆర్మర్డ్, మౌంటైన్ విభాగాలను కలిగి ఉంది. దీనికి తోడు భారత్ రెండు పెద్ద సరిహద్దులైన పాకిస్తాన్, చైనాతో పాటు దేశీయ భద్రతా సవాళ్లను ఎదుర్కొంటుంది.


పాకిస్థాన్‌‌ ఆర్మీ సైనిక సంఖ్య..

పాకిస్థాన్‌ ఆర్మీలో (Pakistan Army) 6.5 లక్షల చురుకైన సైనికులు ఉన్నారు. అలాగే 5 లక్షల రిజర్వ్ సైనికులు ఉన్నారు.ఇది చిన్న దేశం కావడంతో దీని ఆర్మీ ఎక్కువగా భారత సరిహద్దు, దేశీయ తాలిబన్ బెడదలపై దృష్టి పెడుతుంది. భారత ఆర్మీ సంఖ్యాబలంలో రెట్టింపు కాగా.. పాకిస్తాన్ ఆర్మీ తక్కువ సైనికులతో ఎక్కువ రక్షణాత్మక వ్యూహాలపై ఆధారపడుతుంది.


బలాబలాలు ఇలా..

భారత ఆర్మీ సైనిక బలంతో పాటూ అనేక ఆధునిక యుద్ధ సామగ్రి సేకరణలో కూడా ముందంజలో ఉంది. 4,600 ట్యాంకులు (టి-90, అర్జున్), 10,000 ఆర్టిలరీ గన్స్ (భోఫోర్స్, ధనుష్), బ్రహ్మోస్, అగ్ని-5 వంటి మిస్సైళ్లతో భారత్ ఆధిపత్యం చెలాయిస్తోంది. గ్లోబల్ ఫైర్‌పవర్ ఇండెక్స్ (2025) ప్రకారం భారత్ 4వ స్థానంలో ఉంది. అలాగే భారత ఆర్మీ రక్షణ బడ్జెట్ 83 బిలియన్ డాలర్లుగా ఉంది. భారత ఆర్మీకి రష్యా, అమెరికా, ఫ్రాన్స్ దేశాల నుండి సాంకేతిక సహకారం లభిస్తుంటుంది. పాకిస్తాన్ ఆర్మీ బలం దాని రక్షణాత్మక వ్యూహాలు, చైనా నుంచి వచ్చే సాయం ద్వారా ఎఫ్‌ఎమ్-90 శామ్స్, టైప్-59 ట్యాంకులను కలిగి ఉంది. పాక్ ఆర్మీ బడ్జెట్ 27 బిలియన్ డాలర్లు కాగా.. గ్లోబల్ ర్యాంక్ 12గా ఉంది. అదేవిధంగా పాకిస్తాన్ వద్ద 3,700 యుద్ధ ట్యాంకులు, 2,000 ఆర్టిలరీ గన్స్ ఉన్నాయి, అహ్-1జెడ్ వైపర్ హెలికాప్టర్లు కూడా పాకిస్థాన్ ప్రత్యేకతగా చెప్పొచ్చు.


indian-aarmy.jpg

బలహీనతలు ఇలా..

భారత ఆర్మీ బలహీనతలు దాని లాజిస్టిక్స్, మిగ్-21 వంటి పాత ఆయుధాలు కలిగి ఉండడం బలహీనతగా చెప్పొచ్చు. అలాగే 42 స్క్వాడ్రన్ జెట్స్‌ అవసరం ఉండగా 31 మాత్రమే ఉన్నాయి. రెండు మోర్చాల్లో (పాకిస్తాన్, చైనా) యుద్ధం చేయాల్సి రావడం కూడా మరో సవాలు. ఇక పాకిస్తాన్ ఆర్మీ బలహీనతల విషయానికి వస్తే.. దాని ఆర్థిక ఇబ్బందులే (GDP 359 బిలియన్ డాలర్లు) ప్రధాన కారణంగా చెప్పొచ్చు. మరోవైపు ఆధునిక ఇన్‌ఫాంట్రీ వాహనాల కొరత కూడా వేధిస్తోంది. అలాగే పాత ఆయుధాలపై ఆధారపడటం. ఈ ఆర్మీ రాజకీయ జోక్యంలో చిక్కుకోవడం కూడా ఒక లోపంగా చెప్పొచ్చు.


pak.jpg

గెలుపు అవకాశాలు ఇలా..

సంప్రదాయ యుద్ధంలో భారత్ ఆర్మీ.. ఏవిధంగా చూసుకున్నా పాకిస్థాన్‌పై విజయం సాధిస్తుందని చెప్పొచ్చు. 1971లో జరిగిన యుద్ధంతో పాటూ 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలోనూ భారత్ గెలుపొందడమే ఇందుకు ఉదాహరణ. అయితే, రెండు దేశాల వద్ద పరమాణు ఆయుధాలు (భారత్: 130-140, పాకిస్తాన్: 140-150) ఉండటం యుద్ధాన్ని వినాశకరంగా మార్చే ప్రమాదం ఉంది. పాకిస్థాన్ అనుసరించే "మొదటి దాడి" విధానం, అలాగే భారత్ పాటించే "మొదట ఉపయోగించము" విధానంతో రెండు దేశాలూ పరస్పర వినాశనాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉంది. చిన్న యుద్ధంలో భారత్ గెలిచే అవకాశం ఎక్కువ, కానీ దీర్ఘకాల యుద్ధంలో ఆర్థిక ఒత్తిడి, చైనా జోక్యంతో భారత్‌కు సవాళ్లు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. అయితే పాకిస్తాన్ ఆర్థిక బలహీనత దాన్ని త్వరగా ఓడిపోయేలా చేస్తుంది.


భారత ఆర్మీ సంఖ్య, ఆధునికతలో ముందంజలో ఉందని చెప్పొచ్చు. అయితే రెండు మోర్చాల సవాలు భారత్ ఆర్మీ బలహీనత. మరోవైపు పాకిస్తాన్ ఆర్మీ రక్షణాత్మకంగా బలంగా ఉన్నా కూడా.. ఆర్థిక, సాంకేతిక లోటుతో వెనుకబడి ఉంది. యుద్ధ విజయం భారత్ వైపు మొగ్గుతుంది, కానీ పరమాణు ఆయుధాలతో రెండూ గెలుపు కంటే నష్టాన్నే ఎక్కువగా చవిచూడవచ్చు.ఫైనల్‌గా చెప్పాల్సి వస్తే.. శాంతి రెండు దేశాలకూ ఉత్తమ మార్గమని చెప్పాల్సి వస్తుంది.

Updated Date - Apr 03 , 2025 | 11:00 AM